Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో జగన్ ఎమ్మెల్యేలు జంపింగ్‌లు... ఢిల్లీలో జగన్ మీటింగ్‌లు(ఫోటోలు)

ఒక ప‌క్క వైసీపీ నేత‌లు టీడీపీలోకి వ‌ల‌స‌పోతున్నా... జ‌గ‌న్ జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఎవ‌రు పోయినా త‌న‌కు న‌ష్టం లేద‌ని తెగేసి చెప్పిన జ‌గ‌న్ మోహన్ రెడ్డి ఢిల్లీలో త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు అవినీతి చ‌క్ర‌వ‌ర్తి అని జీతీ

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2016 (19:23 IST)
ఒక ప‌క్క వైసీపీ నేత‌లు టీడీపీలోకి వ‌ల‌స‌పోతున్నా... జ‌గ‌న్ జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఎవ‌రు పోయినా త‌న‌కు న‌ష్టం లేద‌ని తెగేసి చెప్పిన జ‌గ‌న్ మోహన్ రెడ్డి ఢిల్లీలో త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు అవినీతి చ‌క్ర‌వ‌ర్తి అని జీతీయ స్థాయి నేత‌లంద‌రికీ నూరిపోస్తున్నారు. బుధ‌వారం ఆయ‌న కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీని క‌లుసుకున్నారు. రాష్ట్రానికి సాయం చేయ‌మ‌ని కోర‌డంతో పాటు, చంద్ర‌బాబు ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌డంపైనా ఫిర్యాదు చేశారు. 
 
ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని, ఒక్కో ఎమ్మెల్యేకు 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత రెండేళ్లలో 31 స్కాంలకు పాల్పడ్డారని, మొత్తం లక్షా 34 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం సాగిస్తున్న అవినీతి కుంభకోణాలు, అనైతిక రాజకీయాల గురించి జాతీయ నేతలకు ఫిర్యాదు చేసేందుకు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన వైఎస్ జగన్.. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. 
 
ఈ సందర్భంగా.. చంద్రబాబు ప్రభుత్వం అవినీతి సొమ్ముతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న వైనాన్ని జైట్లీకి జగన్ వివరించారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్రం సహకరించాలని కోరారు. చంద్రబాబు నాయుడు అవినీతిపై ఎంపర్ ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని జైట్లీకి అందజేశారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments