Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్యాంధ్రప్రదేశ్ మద్యాంధ్రప్రదేశ్ గా మార్చింది జగనే: మాజీ మంత్రి జవహర్

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (06:51 IST)
నవ్యాంధ్రప్రదేశ్ ని మత్తాంధ్రప్రదేశ్ గా,  మద్యాంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి, మంత్రి నారాయణస్వామికే దక్కుతుందని, వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రాష్ట్రంలో ఎక్కడా మద్యపాన నిషేధం చేయకపోగా, ప్రజలను మోసగిస్తున్న జగన్ ప్రభుత్వం, రోడ్ల పక్కన ఉండే బడ్డీకొట్లలో కూడా మద్యం విక్రయాలు సాగిస్తోందని టీడీపీసీనియర్ నేత, మాజీమంత్రి కే.ఎస్. జవహర్ మండిపడ్డారు.

ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.  చంద్రబాబునాయుడు మద్యం అమ్మకాలకు అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలంటున్న మంత్రి నారాయణస్వామి, ముందు ఆయన, ఆయన ప్రభుత్వ చర్యలు ఏవిధంగా ఉన్నాయో చెబితే ప్రజలు సంతోషిస్తారన్నారు.

జగన్మోహన్ రెడ్డి  చంద్రబాబునాయుడిని అడిగే, తన మేనిఫెస్టోలో దశలవారీ మద్యపాన నిషేధం అని చెప్పాడా, అలానే అధికారంలోకి వచ్చాక పిచ్చి బ్రాండ్లు అమ్మి, ప్రజలనుంచి దోచుకుంటామని జగన్ ప్రభుత్వం ఏమైనా చంద్రబాబుకి చెప్పిచేసిందా అని జవహర్ నిలదీశారు.

జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన బృందానికి ఏటా మద్యం అమ్మకాలద్వారానే రూ.5వేలకోట్ల వరకు ఆదాయం వస్తోందని, ఆ మొత్తం దోచుకోవడానికి వారేమైనా చంద్రబాబు అనుమతి తీసుకున్నారా అని మాజీమంత్రి ప్రశ్నించారు. మద్యపాన నిషేధం అనేమాటకు మద్యపాన సేవనం అనే అర్థం వస్తుందని నారాయణస్వామి అనుకుంటున్నాడని, అందుకే ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడన్నారు.

రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.108కోట్లు ఆదాచేశామని చెబుతున్న మంత్రి, మద్యంషాపులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి ఉంటే, ప్రభుత్వానికి రూ.562 కోట్లవరకు వచ్చేవనే నిజాన్ని ఎందుకు తెలుసుకోలేకపో తున్నాడన్నారు. నాసిరకం బ్రాండ్లు అమ్ముతూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ దోపిడీవిధానాల కారణంగా, అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.

నేడు కూడా అనపర్తి నియోజకవర్గంలో దళితయువకుడు ప్రభుత్వ అమ్ముతున్న కల్తీ మద్యంతాగి చనిపోయాడన్నారు. రాష్ట్రంలో ఎటుచూసినా నాటుసారా అమ్మకాలు, కల్తీమద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకోని మంత్రి నారాయణస్వామి, నిద్రమేల్కొని కలుగులోనుంచి బయటకువచ్చి, చంద్రబాబుపై విమర్శలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. 

5 స్టార్ హోటళ్లలో మాత్రం మద్యం అమ్ముతాము.. ఎక్కడా అమ్మేది లేదని చెప్పిన జగన్, నేడు తనకు చెందినవి, తన కుటుంబసభ్యులకు చెందిన కంపెనీల నుంచి తయారయ్యే పిచ్చిపిచ్చి మద్యం బ్రాండ్లను విచ్చలవిడిగా విక్రయిస్తున్నాడని జవహర్ తెలిపారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలతోపాటు, కడప, కర్నూలు, అనంతపురంతో పాటు, తిరుపతిలో సాగుతున్న నాటుసారా అమ్మకాలు డిప్యూటీసీఎం నారాయణస్వామికి కనిపించడం లేదా అని జవహర్ ప్రశ్నించారు. 

మంత్రి ఇప్పటికైనా కళ్లు తెరిచిచూస్తే, వాస్తవాలు బోధపడతాయ న్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగుతున్న మద్యం విక్రయాల కారణంగా రాష్ట్రంలోని మహిళలు కన్నీళ్లు పెట్టని రోజు లేదన్నారు. ముఖ్యమంత్రి నివాసముండే తాడేపల్లి పరిసరాల్లోనే గంజాయి విక్రయాలు సాగుతున్నాయని, ఆ విషయంమంత్రికి తెలియదా అని మాజీమంత్రి నిలదీశారు. 

ప్రజలచేత బాగా తాగిస్తూ, మద్యం అమ్మకాలనే జగన్ ప్రభుత్వం ప్రధానఆదాయవనరుగా మార్చుకుందన్నారు.  మద్యం దుకాణాలకు ఏడిస్టిలరీల నుంచి సరఫరా జరుగుతుందో చెప్పాలని, పొరుగురాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి మద్యం వస్తున్నా, ప్రభుత్వంగానీ, మంత్రి నారాయణస్వామి గానీ ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. మంత్రి హోదాలో ఉండి చంద్రబాబుపై విమర్శలు చేయడంతప్ప, వాస్తవంలో జరిగేవాటిని పట్టించుకునే పరిస్థితిలో నారాయణస్వామి లేడన్నారు.

జగన్ షోలో పప్పెట్ గామారిన నారాయణస్వామి, తాడేపల్లి ఆదేశాలప్రకారం మాట్లాడుతుంటాడన్నారు. ప్రభుత్వానికి మద్యంపై వచ్చే ఆదాయమెంత.. ఏటా ఖర్చయ్యే వ్యయమెంతో ఆయనకుతెలుసునా అని జవహర్ ప్రశ్నించారు. ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో ఉంచడానికి భయపడుతున్నట్లు నటిస్తున్న ప్రభుత్వం, మద్యంషాపులు తెరిచి, వాటిదగ్గర కాపలాగా టీచర్లను ఉంచినప్పుడు వారి ఆరోగ్యంగురించి ఎందుకు ఆలోచించలే దన్నారు.

కరోనాఉధృతంగా ఉన్నసమయంలోనే ప్రభుత్వం మందుషాపులుతెరిచి, రాష్ట్రంలో కరోనాకేసులు పెరిగేలా చేసిందన్నారు. ప్రజలను ఎప్పుడూ మత్తులోనేఉంచి, అధికారం అనుభవించాలనుకునేవారు ఎప్పటికీ, మద్యాన్నినిషేధించలేరని, జవహర్ తేల్చిచెప్పారు.  ప్రభుత్వం కల్తీమద్యం అమ్మబట్టే, రాష్ట్రం లో  హత్యలు, అత్యాచారాలు, ఇతరేతర నేరాలు ఎక్కువయ్యాయన్నారు.

మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో సాగుతున్న కల్తీమద్యం అమ్మకాలపై ప్రశ్నించినందుకు దళితయువకుడిని బలితీసుకున్నా రని, ప్రశ్నించేవారిని బలితీసుకోవడానికి వెనుకాడని ప్రభుత్వం, మద్యం విక్రయాలను నిలిపివేసి, మద్యపాననిషేధం చేస్తుందంటే నమ్మేవారెవరూ లేరన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments