జగన్ మరో సంచలన నిర్ణయం: పంచాయితీరాజ్ లో ఇంజనీరింగ్ పనులు నిలిపివేత

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (20:00 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పారదర్శకంగా పనులు చేపడతామని అవినీతికి తావివ్వకుండా పనులు చేస్తామని పదేపదే చెప్తున్నారు. 
 
అందులో భాగంగా ప్రతీ పనిపై ఆచితూచి స్పందిస్తున్న సీఎం జగన్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్‌లో ఇంజినీరింగ్ పనులు నిలిపివేయాలని ఆదేశించారు. 
 
అందులో భాగంగా పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ పనులు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.586.4 కోట్ల విలువైన ఇంజినీరింగ్ పనులు ప్రభుత్వం నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. 
 
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 144 పనులు నిలిచిపోనున్నాయి. విజయనగరం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలో పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ పనులు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటికి ముందు అనుమతి పొంది ఇప్పటి వరకు పనులు ప్రారంభించని పనులు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పనులు ప్రారంభమైనా 25 శాతానికి మించని పనులపై రివ్యూ నిర్వహించాలని ఆదేశించింది. 
 
ఇకపోతే నిలిపివేస్తున్న 144 పనులకు సంబంధించి రీ టెండరింగ్ నిర్వహిస్తారా లేక కొత్త టెండర్లను పిలుస్తారా అన్నది తెలియాల్సి ఉంది. పనులపై పంచాయితీరాజ్ శాఖ అధికారులతో సమావేశమై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

Laya: సాంప్రదాయబద్ధంగా జీవించే శివాజీ, లయ వాటిని బ్రేక్ చేస్తే?

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పై ల‌వ్ సాంగ్

వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? జబ్ ఖులి కితాబ్ ZEE5లో స్ట్రీమింగ్

109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments