Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలను శక్తిస్వరూపిణులు అన్న మోదీ.. ఇవాంకా చప్పట్లు

హైదరాబాదులో జరుగుతున్న జీఈఎస్ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ప్రసంగానికి తర్వాత మాట్లాడిన మోదీ.. వ్యాపారానుకూల ర్యాంకింగ్స్‌లో వృద్ధి సాధ

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (18:20 IST)
హైదరాబాదులో జరుగుతున్న జీఈఎస్ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ప్రసంగానికి తర్వాత మాట్లాడిన మోదీ.. వ్యాపారానుకూల ర్యాంకింగ్స్‌లో వృద్ధి సాధించామన్నారు. పురాణాల్లో మహిళలను శక్తి స్వరూపిణులుగా పేర్కొన్నారని చెప్పడంతో ఇవాంకా ట్రంప్ చప్పట్ల ద్వారా తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
 
మహిళా సాధికారత అభివృద్ధిలో అత్యంత కీలక అంశమన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో అహల్యబాయ్, లక్ష్మీబాయ్‌లు పోరాడారని గుర్తు చేసుకున్నారు. కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్ తదితరులు దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారన్నారు. మూడు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా మహిళలే ఉన్నారని, పీవీ సింధు, సైనా, సానియా ముగ్గురూ హైదరాబాద్ వారేనని గుర్తు చేశారు. 
 
మహిళలు దృఢ నిశ్చయంతో పనిచేస్తారని కితాబిచ్చారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సలహాలు ఇవ్వాలని మోదీ కోరారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ యోగా దినోత్సవంపై ప్రస్తావించారు. ప్రతి పని మూడు దశలు దాటాలని వివేకానందుడు చెప్పేవాడని గుర్తుచేశారు. జీఈఎస్ సదస్సులో తమ ప్రభుత్వ విధానాలు అద్భుత ఫలితాలనిస్తున్నాయని ప్రకటించారు. ఆర్థిక సంస్థల రిపోర్టులను మోదీ ఘనంగా ప్రకటించారు. మూడీస్ ర్యాంకు నుంచి యోగా వరకు అన్నీ వివరాలను సదస్సులో ప్రస్తావించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments