Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొమ్మలపెళ్ళి.. నిజంగా తాళికట్టిన ఆకతాయి...విస్తుబోయిన ఉపాధ్యాయులు

Webdunia
బుధవారం, 8 జులై 2015 (07:49 IST)
పిల్లలంతా కలసి బొమ్మల పెళ్ళి చేస్తున్నారు. వారిలో ఓ బాలిక కూడా ఆడుకుంటోంది. అయితే ఓ ఆకతాయి అమ్మాయి మెడలో తాళి కట్టేశాడు. అదే తాళితో బడి వెళ్లడంతో ఉపాధ్యాయులు విస్తుబోయారు. తల్లిదండ్రులను పిలిచి ఇదేందని ప్రశ్నించిన సంఘటన విశాఖ పట్టణం జిల్లాలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. 
 
విశాఖప ట్నం జిల్లా ఎలమంచిలి ప్రాంతం రెల్లివీధి గ్రామానికి చెందిన జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నది. శనివారం స్నేహితురాళ్లతో కలిసి శివాలయం వెళ్లింది. అక్కడ వారు సరదాగా బొమ్మల పెళ్లి ఆడుతున్నారు. ఇంతలో అక్కడకు బంగారి అప్పన్న (22) వచ్చాడు. ఆట మధ్యలో బాలిక మెడలో పసుపుతాడు కట్టాడు. ఇదేమిటని బాలిక అడగ్గా, ‘దేవుడి సమక్షంలో తాళి కట్టాను. ఇకనుంచి మనం భార్యాభర్తలం’ అని చెప్పాడు. ఆ పదానికే సరిగా అర్థం తెలియని ఆ బాలిక ను దేవుడి పేరిట భయపెట్టాడు. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో బంధించి మరింత బెంబేలెత్తించాడు. 
 
‘తాళి తీయొద్దు’ అని గదమాయించాడు. రెండు రోజుల్లో విజయవాడకు తీసుకెళతానని.. అక్కడ కాపురం పెడదామని చెప్పాడు. బాలిక ఇంటికి దగ్గర్లోనే అప్పన్న ఉంటాడు. అప్పన్న నిర్వాకం గురించి బాలిక తన ఇంట్లో చెప్పలేదు. తాళిని తీసి స్కూలు బ్యాగులో దాచేసింది. సోమవారం ఉదయం బడికి బయలుదేరింది. బ్యాగులో దాచిన తాళిని దారిలో మెడలో వేసుకొని పాఠశాలలో అడుగుపెట్టింది. 
 
విస్తుబోయిన టీచర్లు ఉన్నపళాన తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. కాగా అప్పన్న తనకు తెలుసునని బాలిక అంగీకరించింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments