Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాగుంట కంపెనీల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

Webdunia
ఆదివారం, 9 డిశెంబరు 2018 (12:19 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన బాలాజీ గ్రూపునకు చెందిన కంపెనీల కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు మూడో రోజు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ఆ గ్రూపునకు చెందిన కార్యాలయాలతో పాటు 13 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 
 
తమిళనాడులోని మాగుంట గ్రూపు సంస్థల వ్యాపార లావాదేవీలన్నీ చెన్నై బజుల్లా రోడ్డులోని ప్రధాన కార్యాయం ద్వారానే సాగుతుంటాయి. ప్రధాన కార్యాలయంతో పాటు చెన్నై శివారు పూందమల్లిలోని మద్యం తయారీ ఫ్యాక్టరీలో అవినీతి నిరోధకశాఖ చేపట్టిన తనిఖీల్లో అత్యంత కీలక పత్రాలతో పాటు.. కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. 
 
కాగా, గత నెల 30వ తేదీన రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చెన్నైలోని ఒక స్టార్‌ హోటల్‌పై నిఘాపెట్టి భారీ స్థాయిలో 7 కిలోల విదేశీ బంగారు బిస్కెట్లు, రూ.16 కోట్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా దీంతో సంబంధం ఉన్న కొరియా దేశానికి చెందిన ఇద్దరు యువతులను, చెన్నైకి చెందిన హవాలా వ్యాపారిని అరెస్ట్‌ చేశారు. వాటికి కొనసాగింపుగానే మాగుంట కార్యాలయంపై దాడులు జరిపారనే వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments