'కల్కి కోట'లో ముగిసిన ఐటీ దాడులు... సీడీలు - హార్డ్ డిస్క్‌లు స్వాధీనం

Webdunia
ఆదివారం, 20 అక్టోబరు 2019 (09:56 IST)
మహా విష్ణువు పదో అవతారంగా చెప్పుకుంటూ రాజభోగాలు అనుభవించిన కల్కి భగవాన్ ఆశ్రమంలో ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాలు శనివారం రాత్రితో ముగిశాయి. ఈ సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారు, వజ్ర ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పలు సీడీలు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకుని వాటిని విశ్లేషిస్తున్నారు. 
 
కల్కి ట్రస్టుకు దేశ, విదేశాల నుంచి వస్తున్న విరాళాలను ఇతర వ్యాపారాలకు మళ్లిస్తున్నారనే అభియోగాల నేపథ్యంలో చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో ఉన్న కల్కి భగవాన్ ఆశ్రమంలో గత నాలుగు రోజులు పాటు ఐటీ సోదాలు జరిగాయి. వరదయ్యపాళెం మండల పరిధిలోని ఏకం ఆధ్యాత్మిక కేంద్రం, ఉబ్బలమడుగు సమీపంలోని ఆనందలోక క్యాంపస్‌లలో ఐటీ అధికారులు తనిఖీలు జరిపారు. 
 
ఏకం ఆశ్రమంలో అధిక మొత్తంలో నగదు, బంగారం, భూములకు సంబంధించిన పత్రాలు, నగదు లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అధికారులు ఆశ్రమ నిర్వాహకులు, ఉద్యోగుల నుంచి లిఖితపూర్వక వివరణ తీసుకున్నట్లు తెలిసింది. నాలుగు కంప్యూటర్లు, హార్డ్‌డిస్కులను కూడా సీజ్‌ చేశారు. 
 
ఆశ్రమం నుంచి చెన్నైకి బయలుదేరిన అధికారులను మాట్లాడించేందుకు స్థానిక విలేకరులు ప్రయత్నించగా.. 'మేం పూర్తి వివరాలను చెన్నైలోని ప్రధాన కార్యాలయం నుంచి ప్రకటిస్తాం' అని చెబుతూ.. వెళ్లిపోయారు. ఆశ్రమంలోని వన్‌హ్యూమానిటీ కేర్‌ సంస్థ ఉపాధ్యక్షుడు లోకేశ్‌జీ కూడా ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments