జనసేనకు జనాదరణ తగ్గుతోందా? ఎందుకు?

ప్రజల కోసమే పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై బాగానే స్పందిస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకులు భావన. అయితే ఆయన ప్రసంగంలో తప్పులు దొర్లుతున్నాయని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని రాజకీయ విశ్లేష

Webdunia
శనివారం, 7 ఏప్రియల్ 2018 (17:46 IST)
ప్రజల కోసమే పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై బాగానే స్పందిస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకులు భావన. అయితే ఆయన ప్రసంగంలో తప్పులు దొర్లుతున్నాయని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 
 
మిగిలిన రాజకీయ పార్టీల నేతలు వేరే పవన్ కళ్యాణ్‌ వేరే. సినిమా రంగం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్‌ రాజకీయాలవైపు వెళ్ళినప్పుడు నిజాయితీగా, నిబద్థతతో పనిచేస్తాడని అందరూ అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్‌‌లో కూడా మార్పు వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎలాగంటారా.. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఆమరణ దీక్ష అన్నారు పవన్ కళ్యాణ్‌. 
 
కానీ ఇప్పటికే వైసిపి ఎంపిలు ఆమరణ దీక్షకు కూర్చునేశారు. పవన్ దీక్ష చేస్తే ఖచ్చితంగా కేంద్రం స్పందిస్తుందని అందరూ భావించారు. కానీ అది జరగనేలేదు. కేవలం పాదయాత్రతో సరిపెట్టుకుంటున్నారు. దీంతో జనంలో పవన్ కళ్యాణ్‌ పైన నమ్మకం తగ్గుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 
 
గతంలో కూడా కొన్ని సమస్యలపై పవన్ పోరాడినా వాటిని పూర్తిస్థాయిలో పరిష్కారం వైపు తీసుకెళ్ళే దిశగా ప్రయత్నం చేయలేకపోయారు. ఇప్పుడు కమ్యూనిస్టు నేతలతో కలిసి తిరుగుతున్న పవన్ మాట మీద నిలబడతారా లేదా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చూడాలి వచ్చే ఎన్నికల్లోపు పవన్ కళ్యాణ్‌ జనసేన పార్టీ పరిస్థితి ఎలా వుంటుందో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది : జాన్వీ కపూర్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments