నా భార్యది ఆత్మహత్యా? హత్యా?: పోలీసులకు కన్నా కుమారుడు ఫిర్యాదు

Webdunia
శనివారం, 25 జులై 2020 (10:21 IST)
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక అనుమానాస్పద మరణంపై ఆయన కుమారుడు ఫణీంద్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన సైబరాబాద్‌ పోలీసులకు  ఫిర్యాదు చేశారు.

తన భార్యకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని చెప్పారు. ఆమె చనిపోయిన రోజున డ్రగ్‌ పార్టీ జరిగిందని, ఆ పార్టీలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నారని, వారంతా ఘటనా స్థలం నుంచి పారిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు.

సిబిఐటి వద్ద ఉన్న ఫాంహౌస్‌‌లో తన భార్య చనిపోయిందంటూ తొలుత చెప్పారని, ఆ తర్వాత మాట మార్చారని చెప్పారు. తన భార్యది ఆత్మహత్యా లేక హత్యా అనే విషయాన్ని తేల్చాలని పోలీసులను కోరారు. తన తోడల్లుడితో తమకు ఆర్థిక వివాదాలు ఉన్నాయని ఫణీంద్ర తెలిపారు.

ఆరోజు పార్టీలో పాల్గొన్న వారంతా తప్పించుకు తిరుగుతున్నారని చెప్పారు. సిబిఐటి వద్ద ఆమె చనిపోయిందని వారు చెప్పారని, ఆ తర్వాత మీనాక్షి మ్యాన్షన్‌లో జరిగిందని రాయదుర్గం సిఐ దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు.

స్థలం గురించి అబద్దాలు చెప్పడం వల్లే తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. తన భార్య చనిపోయిన రోజు జరిగింది పార్టీ కాదని, తమ మధ్య ఉన్న ప్రాపర్టీ వివాదాలపై మాట్లాడటానికి ఆమె వెళ్లిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments