Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌దిలిక‌ల్లో అనుమానాలు... 50 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారా?

హైద‌రాబాద్ : వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీకి పెద్ద షాక్ త‌గ‌ల‌నుందా? సొంత పార్టీలోనే కాదు... కుటుంబంలోనూ లుక‌ల‌క‌లు రానున్నాయా? గ‌త కొద్ది రోజులుగా జూనియ‌ర్ ఎన్టీఆర్, నంద‌మూరి హ‌రికృష్ణ క‌ద‌లిక‌లు అనుమానాస్ప‌దంగా ఉన్నాయ‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నా

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (12:47 IST)
హైద‌రాబాద్ : వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీకి పెద్ద షాక్ త‌గ‌ల‌నుందా? సొంత పార్టీలోనే కాదు... కుటుంబంలోనూ లుక‌ల‌క‌లు రానున్నాయా? గ‌త కొద్ది రోజులుగా జూనియ‌ర్ ఎన్టీఆర్, నంద‌మూరి హ‌రికృష్ణ క‌ద‌లిక‌లు అనుమానాస్ప‌దంగా ఉన్నాయ‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ త్వ‌ర‌లో కొత్త పార్టీ పెడ‌తాడ‌ని సోష‌ల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆ పార్టీలో కీలక పాత్ర పోషించబోతున్నార‌ట‌. 
 
తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ, బావ సీఎం చంద్ర‌బాబుతో ఎడ‌ముఖం పెడముఖంగా ఉంటున్న నందమూరి హరికృష్ణ మ‌రోసారి చ‌క్రం తిప్ప‌నున్నార‌ని చెపుతున్నారు. కృష్ణా జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా జూనియ‌ర్ ఎన్టీఆర్ పార్టీలో కీలక భూమిక వహించబోతున్నారట. ఎన్టీఆర్ పార్టీ గురించి రూమ‌ర్సే త‌ప్ప అధికారికంగా ఎలాంటి సమాచారం ఇంత‌వ‌ర‌కు లేదు. 
 
కానీ, ఎన్టీఆర్‌తో ఇప్ప‌టికే 50 మంది ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ని చెపుతున్నారు. ఇదే నిజమైతే ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయాల్లో హ‌ఠాత్ప‌రిణామాలు చోటుచేసుకునే అవ‌కాశం ఉంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ మధ్య అధికారం ఢీ అంటే ఢీ అనే పోరు నడుస్తోంది. మ‌రో ప‌క్క ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌నసేన అంటూ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నాడు. ఈ త‌రుణంలో ఒక‌డుగు ముందుకేసి జూనియ‌ర్ సొంత పార్టీ పెడితే, అబ్బో ఏపీ రాజ‌కీయం ఉడుకెత్తిపోదూ!
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments