Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిని శ్మశానం-ఎడారి అంటుంటే బాధేస్తోంది: చంద్రబాబు

Webdunia
బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (15:57 IST)
రాజధానిని శ్మశానం, ఎడారి అంటే చాలా బాధేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ  29 గ్రామాల రైతులు, మహిళల దీక్షలు 50వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా రాయపూడిలో ఏర్పాటు చేసిన  దీక్షాశిబిరాన్ని చంద్రబాబు సందర్శించారు. మహిళలు, రైతులకు సంఘీభావం తెలిపారు.
 
అమరావతికి వరదలు వస్తాయని, రాజధాని మునిగిపోతుందంటూ పదేపదే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వైకాపా నేతలను విమర్శించారు. 23 ఏప్రిల్‌ 2015న కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఏపీ రాజధాని అమరావతి అని.. ఈ విషయంలో రాష్ట్రాన్ని కేంద్రం ఎందుకు ప్రశ్నించడం లేదని చంద్రబాబు అన్నారు.

చట్టాలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. రాజధాని కోసం అమరావతి రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు అన్నారు.
 
‘‘అన్ని రాష్ట్రాలకంటే ఏపీ మిన్నగా ఉండాలని పని చేశా. అప్పట్లో హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ నిర్మించక పోయి ఉంటే.. ఆ నగరం అంత అభివృద్ధి చెందేదా? అన్ని కంపెనీలు అక్కడికి వచ్చేవా? అదే తరహాలో అమరావతిని కూడా నిర్మించాలనుకున్నాను. కానీ, అధికార మార్పిడి జరిగింది.

వైకాపా ప్రభుత్వం వైఖరితో రాష్ట్రానికి రావాల్సిన సంస్థలన్నీ తిరిగి వెనక్కి వెళ్లిపోతున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది’’ అని చంద్రబాబు అన్నారు. రైతుల పోరాటం తప్పనిసరిగా విజయం  సాధిస్తుందని ఆకాంక్షించారు. ప్రాచీన నగరానికి అమరావతి చిహ్నమని చంద్రబాబు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments