Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసుకపై జోక్యం చేసుకోండి.. గవర్నర్ కు పవన్ వినతి

Webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (18:42 IST)
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్​తో భేటీ అయ్యారు. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, ఇసుక కొరత వంటి అంశాలపై వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ కలిసి వినతిపత్రం అందజేశారు.

35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు దుర్భర దయనీయ స్థితిలో జీవితాన్ని గడుపుతున్నారని తన వినతిపత్రంలో పవన్‌ పేర్కొన్నారు. అనేకమంది భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరక్క ఉపాధి కోల్పోయారని.. ఈ విషయంపై తాము అనేక నివేదికలు, సమావేశాల ద్వారా వివరణాత్మకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామన్నారు.

అయినా రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో స్పందించలేదన్నారు. ఈ పరిస్థితులలో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా రాష్ట్రంలో ఇసుక సరఫరాను పునరుద్ధరించాలని.. తద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని.. నూతన ఇసుక ప్రణాళికను తక్షణం ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ జనసేన పార్టీ లాంగ్‌మార్చి నిర్వహించిందని చెప్పారు.

అయినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన కనిపించడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరారు. రాష్ట్రంలో ఎలాంటి ఇసుక ప్రణాళిక ఉంటే భవన నిర్మాణ కార్మికులకు ఉపయుక్తంగా ఉంటుందో యోచించి తాము ఈ లేఖతో పాటు ఇసుక ప్రణాళికను అందిస్తామని.. పరిశీలించాలని పవన్‌ కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments