Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడనీ విద్యార్థి ఆత్మహత్య

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2016 (11:35 IST)
ఇంటర్మీడియ్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా రాయచోటిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కడప జిల్లా రాయచోటికి చెందిన శ్రీనివాసులు కుమారుడు లోకేష్‌ చిత్తూరు జిల్లా సి.రామాపురం పంచాయతీ కోదండరామాపురంలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేశాడు. ఈనెల 19వ తేదీన వెల్లడైన ఇంటర్మీడియల్‌ పరీక్షల్లో ఫెయిలైనట్లు ఫలితాలు రావడంతో లోకేష్‌ మనస్థాపానికి గురయ్యాడు. తన కుమారుడు ఫెయిలైనా తండ్రి శ్రీనివాసులు అదే కళాశాలలో ఎంసెట్‌కు శిక్షణలో చేర్పించాడు. 
 
అయితే ఇంటర్‌లో ఫెయిలయ్యానన్న మనస్థాపంలో సోమవారం తెల్లవారుజామున హాస్టల్‌‌లో ఎవరూ లేని సమయంలో లోకేష్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లోకేష్‌ మృతితో హాస్టల్‌‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. లోకేష్‌ను చూసిన తల్లిదండ్రులు కన్నీంటి పర్యాంతమయ్యారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments