Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. వరుడు వేరే కులమని తెలియడంతో తాళి తెంచేసిన వధువు!

Webdunia
సోమవారం, 30 మే 2016 (10:12 IST)
ఇద్దరు ప్రేమికులు ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే విడిపోయారు. వీరిద్దరు విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? కులం. ఫలితంగా.. ఈ ప్రేమ జంట కొన్ని గంటల్లోనే విడిపోయారు. ఈ వివరాలను పరిశీలిస్తే... కర్నూలు జిల్లా మదనపల్లెకి సమీపంలోని పీటీఎం మండలానికి చెందిన యువకుడు బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ యువకుడు తిరుపతికి చెందిన ఒక యువతిని యేడాదిగా ప్రేమిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం ప్రేమికులిద్దరు ఇళ్ల నుంచి వెళ్లిపోయి ఆదివారం ములకలచెరువు సమీపంలోని ఒక గుడిలో వివాహం చేసుకున్నారు. 
 
అక్కడి నుంచి మదనపల్లెకు వచ్చి ఆర్టీసీ బస్టాండులో తిరుపతి బస్సు ఎక్కుతుండగా యువతి అక్కలు మదనపల్లెకు చేరుకుని ప్రేమికులను అడ్డుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు వేరే కులానికి చెందిన వాడని వధువు చెప్పారు. పైగా.. వేలే కులానికి చెందిన వాడిని ఎలా పెళ్లి చేసుకుంటాంటూ కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో ఆ వధువు మనసు మార్చుకుంది. వేరే కులానికి చెందిన వ్యక్తి అని తనకు ఏనాడూ చెప్పలేదంటూ అతనిపై మండిపడి, ఈ పెళ్లి ఇష్టం లేదని వెంటనే తాళి తీసేసింది. 
 
అయితే తాను వేరే కులానికి చెందినవాడిననే విషయం యువతికి ఎప్పుడో తెలుసునంటూ ఆ యువకుడు గట్టిగా వాదించసాగాడు. ఈ గొడవను గమనించిన స్థానికులు రెండో పట్టణ రక్షకభటులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. రోడ్డుపై గొడవపడటం నేరమని చెప్పి, ఏమైనా విభేదాలు ఉంటే న్యాయస్థానంలో తేల్చుకోవాలని చెప్పి వారిని పంపేశారు. దీంతో యువతిని కుటుంబసభ్యులు తిరుపతికి తీసుకెళ్లిపోయారు. 

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments