Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంకీపాక్స్ నిర్ధారణ కిట్‌ను ఉత్పత్తి చేసిన ఏపీ మెడ్‌టెక్!!

ఠాగూర్
ఆదివారం, 25 ఆగస్టు 2024 (11:44 IST)
విశాఖపట్టణంలోని ఏపీ మెడ్‌టెక్ జోన్ సరికొత్త ఆవిష్కరణను రూపొందించింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్ సోకిందా లేదా అన్నది నిర్ధారించేందుకు వీలుగా ఓ కిట్‌ను ఉత్పత్తి చేసింది. ఈ కిట్‌కు ఐసీఎంఆర్, సీడీఎస్ఈ‌ నుంచి అత్యవసర అనుమతులు కూడా లభించాయి. ఫలితంగా ఈ కిట్‌ను రెండు వారాల్లో దేశీయ మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకునిరానున్నారు. 
 
కరోనా సమయంలో ఆరోగ్య రంగానికి అవసరమైన అనేక దేశీయ ఉత్పత్తులను ఈ మెడ్‌టెక్ అందించింది. తాజాగా మంకీపాక్స్‌ నిర్ధారణ కోసం దేశీయంగా తొలిమంకీ పాక్స్ ఆర్టీ పీసీఆర్ కిట్‌ను తయారుచేసింది. తమ భాగస్వామ్య ట్రాన్సేషియా డయాగ్నస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎంపాక్స్ వ్యాధి నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ కిట్‌ను ఉత్పత్తి చేసింది. ఎర్బాఎండీఎక్స్ మంకీపాక్స్ ఆర్టీ  పీసీఆర్ పేరుతో కిట్‌ను అభివృద్ధి చేసింది. 
 
ఎంపాక్స్ నిర్ధారణకు దేశీయంగా రూపొందించిన తొలి టెస్టింగ్ కిట్ ఇదేనని శనివారం మెడ్‌టెక్ ప్రకటించింది. కిట్‌కు ఐసీఎంఆర్, సీడీఎస్‌సీవో నుంచి అత్యవసర అంగీకారం లభించినట్టు సంస్థ ప్రకటించింది. ఆరోగ్యం రంగంలో మన దేశ ప్రతిభకు ఇదే తార్కాణమని మెడ్‌టెక్ సిటీ సీఈవో జితేంద్ర శర్మ వ్యాఖ్యానించారు. ఈ కిట్‌ను రెండు వారాల్లో మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments