కరోనా వ్యాక్సినేషన్ల విషయంలో ఏపీ రికార్డు.. ఒకే రోజు 6.40లక్షల మందికి..?

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (11:34 IST)
ఆంధ్రప్రదేశ్ కరోనా వ్యాక్సినేషన్ల విషయంలో రికార్డు సాధించింది. ఏపీలో ఒకే రోజు 6.40 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ వేశారు. టీకా వచ్చిన 24 గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేశారు. దేశవ్యాప్తంగా 31.39 లక్షల మందికి టీకా వేయగా.. అందులో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానమని అధికారులు తెలిపారు. కేంద్రం తగినంత ఇస్తే నెలకు కోటిన్నర మందికి టీకా వేస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 
 
సచివాలయాల సిబ్బంది సహకారంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. అలాగే అదనపు వ్యాక్సిన్లు కావాలని ఏపీ అధికారులు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో రోజుకు 6 లక్షల డోసులు వేసే సామర్థ్యం వుందని అధికారులు తెలిపారు. 
 
ఏపీకంటే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాలు సైతం ఒక్క రోజులో ఏపీలో వేసినంత వేగంగా వ్యాక్సిన్‌ వేయలేకపోయాయి. ఇతర ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదు. 6.40 లక్షల డోసుల్లో 4.40 లక్షల డోసులు కోవిషీల్డ్, 2 లక్షల డోసులు కోవాగ్జిన్‌ ఉన్నాయి. 45 ఏళ్లు దాటిన వారి నుంచి ఆపైన వయసున్న వారికి వ్యాక్సిన్‌ వేశారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో పీహెచ్‌సీ పరిధిలోని ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంలో టీకా ప్రక్రియ కొనసాగించారు. మొత్తం 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 255 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని సచివాలయాల్లో వ్యాక్సిన్‌ వేశారు. 
 
ఈ నెల 13న రాష్ట్రానికి వచ్చిన 6.40 లక్షల డోసుల వ్యాక్సిన్‌ను ఒకే రోజు జిల్లాలకు.. అక్కడ నుంచి పీహెచ్‌సీలకు, అక్కడ నుంచి గ్రామ, వార్డు సచివాలయాలకు చేర్చారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు టీకా ప్రక్రియ కొనసాగించారు. ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లు, సిబ్బంది సహకారంతో రికార్డు స్థాయిలో వ్యాక్సిన్‌ వేయగలిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్ నుంచి కురిసే వాన.. లిరికల్ సాంగ్ రిలీజ్

Rohit Nara:.నటి సిరి లెల్లాతో రోహిత్ నారా వివాహం హైదరాబాద్ లో జరిగింది

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments