Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూతన చట్టం అమలు అయితే ఎన్నికల్లో పోటీ చేయలేము: జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (05:11 IST)
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన చట్టంపై ఆయన స్పందించారు. నూతన చట్టం అమలు అయితే ఎన్నికల్లో పోటీ చేయలేమని పేర్కొన్నారు. 

కాగా స్థానిక ఎన్నికల్లో డబ్బు, మద్యం నిషేదిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక డబ్బు పంచినట్లు రుజువైతే మూడు సంవత్సరాల పాటు జైలు  శిక్ష విధించనున్నట్లు పేర్కొన్నారు.

దీనిపై జేసీ మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉంటామని.. మున్సిపల్‌, సర్పంచ్‌, పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేయమని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేయవద్దు అంటే ఎలా అని.. డబ్బు పంచితే జైలుకు వెళ్లాలా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇలాంటి చట్టం ఉంటే పోటీ చేసినా ప్రయోజనం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు.  ‘గత స్థానిక ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేసే మా వాళ్లు ఎన్నికల్లో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో మా అనుచరులు దూరంగా ఉంటారు.

ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఇటాంటి చట్టాలు లేవు కనుకే పోటీ చేస్తున్నాం. చంద్రబాబు అదృష్టవంతుడు.. విశాఖలో ఎలాంటి భౌతిక దాడి లేకుండానే క్షేమంగా బయటపడ్డారు’ అని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments