Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ వీసాలతో దేశం దాటుతున్న మహిళల గ్యాంగ్ అరెస్టు

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (13:53 IST)
పొట్ట కూటి కోసం, ఉపాధి కోసం దేశం విడిచి కువైట్‌కు వెళ్తున్న మహిళలు ఇమ్మిగ్రేషన్‌ అధికారుల చేతిలో చిక్కారు. నకిలీ వీసాలలో దేశం దాటుతున్నారని ఆరోపించబడి అరెస్ట్‌కు గురయ్యారు. ఈ కేసులో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు 26 మంది మహిళలను అరెస్టు చేశారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మహిళలు ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లేందుకు సంసిద్ధం కాగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారిని పట్టుకున్నారు. 
 
వారి వద్ద ఉన్న వీసాలు సరైనవి కావని ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు సమాచారం అందడంతో రెండు రోజుల పాటు విదేశాలకు వెళ్తున్న మహిళలపై నిఘా ఉంచారు. వారి వీసాలను తనిఖీ చేసి అవి నకిలీవని తేల్చారు. మంగళవారం ముగ్గరు పట్టుబడగా బుధవారం 23 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కానీ పట్టుబడిన మహిళలపై పోలీసులు కేసులు పెట్టకుండా మానవతా దృక్పథంతో వారిని విడిచిపెట్టాలని గల్ఫ్‌ సంక్షేమ సంఘం ప్రతినిధి బసంత్‌రెడ్డి కోరారు. 
 
జీవనోపాధి కోసం వెళ్లే మహిళలపై ఇలాంటి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. వీరంతా దేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన ఏజెంట్‌ల చేత మోసపోయారని వెల్లడించారు. ఆ ఏజెంట్‌ల ఆచూకీ కనిపెట్టి కఠినంగా శిక్షించాలని చెప్పారు. కాగా వీరికి నకిలీ వీసాలు ఎలా వస్తున్నాయి? ఏ ప్రాంతానికి చెందిన ఏజెంట్ల వద్ద వారు ఈ వీసాలు పొందారు? అనే కోణంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు ఈ మహిళలను ఆర్జీఐఏ పోలీస్టేషన్‌కు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments