ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

ఠాగూర్
శుక్రవారం, 21 మార్చి 2025 (09:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న మూడు రోజుల వాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చి నెలలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో పగటిపూట ప్రజలు బయటకు రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఏసీలు, ఫ్యాన్లు లేకుండా ఉండలేని పరిస్థితి ఉంది. ఇంటువంటి సమయంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. 
 
శని, అది, సమవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులుసైతం పడతాయని అంచనా వేసింది. 
 
మరోవైపు, నంద్యాల జిల్లా దొర్నిపాడులో గురువారం అత్యధికంగా 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో 40.2, కర్నూలు జిల్లా లద్దగిరిలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతుల నమోదయ్యాయి. కాగా, 30 మండలాల్లో వడగాలులు వీచాయి. అదే విధంగా వేసవి ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పులు పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments