Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర బంధం.. ఆమెను గొడ్డలితో నరికి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

తెలంగాణ రాష్ట్రంలో వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. వివాహితను హత్య చేసిన యువకుడు తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం ధంపూర్‌ శివారులో జరిగ

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (17:18 IST)
తెలంగాణ రాష్ట్రంలో వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. వివాహితను హత్య చేసిన యువకుడు తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం ధంపూర్‌ శివారులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. కొలాంగూడకు చెందిన వివాహిత మడావి సునీత(41), ఇదే గ్రామానికి చెందిన టేకం గోవింద్‌(26)కు మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. అయితే, వీరి బంధానికి సునీత భర్త అడ్డొస్తున్నాడనీ భావించి ఈనెల 21వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. 
 
దీంతో సునీత భర్త నాగోరావ్‌ శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో శనివారం వారిద్దరి మృతదేహాలు కొలాంగూడ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పత్తిచేనులోని గుడిసెలో కనిపించాయి. సునీత, గోవింద్‌ శుక్రవారం రాత్రి చేను వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంటికి వెళ్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయోననే భయంతో వీరు ఆత్మహత్య చేసుకుని వుంటారని పోలీసులు భావిస్తున్నారు. 
 
సునీత చీరతో చేరో వైపు ఉరేసుకోవాలని ఏర్పాటు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఉరికి సునీత అంగీకరించకపోవడంతో అక్కడే ఉన్న గొడ్డలితో ఆమె గొంతుపై నరికి ఆ తర్వాత గోవింద్‌ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. సునీతకు కూతురు, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments