Webdunia - Bharat's app for daily news and videos

Install App

వై.వి.బి. వైసీపీలోకి మారితే రూ. 300 కోట్లు ఇస్తారా?

Webdunia
సోమవారం, 26 జులై 2021 (10:27 IST)
ఏపీ స‌ర్పంచుల ఫోరం అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన టీడీపీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్ర‌ప్ర‌సాద్ చుట్టూ ఇపుడు రాజ‌కీయ దుమారం చెలరేగుతోంది. టీడీపీలో ఉన్న ఆయ‌న వైసీపీలోకి మారితే 300 కోట్లు ఇస్తామని ఒక వ‌దంతిని రేపారు. ఆ ఫేక్ న్యూస్‌ని ఓ జర్నలిస్ట్ పుట్టించి త‌న‌ను అప్ర‌తిష్ఠ పాలు చేయాల‌ని చూస్తున్నార‌ని వై.వి.బి చెపుతున్నారు.

ఆ జ‌ర్న‌లిస్టుతో దాని మీద ఒక వీడియో చ‌ర్చ‌...చేసి... నీకాడ ఏముందని 300 కోట్లు ఇస్తారు.... అని ఎటకారం చేస్తా అడిగాడ‌ని ఆరోపిస్తున్నారు. దీనితో వై.వి.బి. రాజేంద్ర‌ప్ర‌సాద్ జ‌ర్న‌లిస్ట్‌కి ఫోన్ చేసి... నేను ఆమాట అన్న వీడియో చూపించు అంటే .. ఎక్కడో చూశాను తెలీదన్నాడట.. ఇలా ఏమీ తెలుసుకోకుండా నోటికొచ్చింది వాగేస్తావా? అనడిగితే నోరు మూసుకున్నాడట.
 
వై.వి.బి. రాజేంద్ర‌ప్ర‌సాద్ ఫోన్ తర్వాత సదరు జర్నలిస్ట్ వివరణ ఇచ్చుకుంటా, వీడియో చేశాడు. దీంట్లో ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిన వారి గురించి చెబుతున్నాడు తప్ప... అదే ఫేక్ త‌నూ స్ప్రెడ్ చేశాడనే విషయాన్ని చెప్పట్లేద‌ని, ఆ జర్నలిస్టుది అంతా గురివింద నీతి అని..... అసలు ఏమీ తెలుసుకోకుండా నోటికొచ్చింది వాగటమే ఓ తప్పైతే .. మళ్లీ వివరణ ఇచ్చేప్పుడు కూడా తనూ తప్పుచేశానని చెప్పకుండా కేవలం ఎదుటోళ్లకి నీతులు చెబుతున్నాడ‌ని వై.వి.బి. రాజేంద్ర‌ప్ర‌సాద్ విమ‌ర్శిస్తున్నారు. 
 
సర్పంచుల‌ హక్కులకై, వ్యవస్థలో కొన్ని కీలక మార్పుల కోసం పోరాడిన వై.వి.బి. రాజేంద్ర‌ప్ర‌సాద్, తాను  డబ్బు కోసం వీడియోలు తీసే అలాంటి  వారికి వివరణ ఇవ్వాల్సి రావటం బాధాకరం...అంటున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments