Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు 9 గంటలు నిద్రపోండి.. మీ చేతుల్లో మీ యవ్వనం: దలైలామా

ఒక వయస్సు దాటాక, రోజుకు 7 గంటలు నిద్రపోతే సంపూర్ణ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్లే అని ఆధునిక, ప్రాచీన వైద్య శాస్త్రాలు తెలుపుతున్నాయి. కానీ బౌద్ధ మత గురువు దలైలామా మాత్రం నిత్య యవ్వనానికి ఒకటే సూత్రం అంటున్నారు. అదేమిటో తెలుసా.. రోజుకు 9 గంటలు నిద్రపోతే

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (03:38 IST)
ఒక వయస్సు దాటాక, రోజుకు 7 గంటలు నిద్రపోతే సంపూర్ణ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్లే అని ఆధునిక, ప్రాచీన వైద్య శాస్త్రాలు తెలుపుతున్నాయి. కానీ బౌద్ధ మత గురువు దలైలామా మాత్రం నిత్య యవ్వనానికి ఒకటే సూత్రం అంటున్నారు. అదేమిటో తెలుసా.. రోజుకు 9 గంటలు నిద్రపోతే మీ యవ్వనం మీ చేతుల్లోనే ఉంటుందని చెబుతున్నారాయన.
 
దలైలామా సౌత్ ఏషియా సెంటర్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ దలైలామాను ఒక ప్రశ్న వేశారు. ’మేము కూడా మీలాగా తేజోవంతంగా, హుషారుగా, తెలివిగా ఉండాలంటే ఏం చేయాలి.. మీరు పాటిస్తున్న రహస్యాన్ని తెలపండి’’.. కార్యక్రమం చివర్లో దలైలామాను మంత్రి కేటీఆర్‌ అడిగిన ప్రశ్న ఇది. 
 
ఈ ప్రశ్నకు దలైలామా నవ్వుతూ.. ‘‘ప్రశాంతంగా నిద్రపోవడమే’’ అన్నారు. తాను ప్రతి రోజు 9 గంటలు నిద్రపోతానని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు నిద్రపోయి తెల్లవారుజామున 3గంటలకు లేస్తానని, ఆ తర్వాత నాలుగైదు గంటలు ధ్యానం చేస్తానని తెలిపారు. ప్రస్తుతం తన వయసు 82 సంవత్సరాలని, కానీ అందరూ 60-65 సంవత్సరాలని అనుకుంటారన్నారు. 
 
మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ... బౌద్ధ గురువు దలైలామాతో గడిపిన ఈ క్షణాల్లో తాను ఎంతో విలువైన అంశాలు నేర్చుకున్నానని తెలిపారు. దలైలామా సౌత్ ఏషియా సెంటర్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ సెంటర్‌ కార్యాకలాపాలకు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయం చేస్తామని తెలిపారు. ఇప్పటికే స్థలం, రూ. 5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్లు రెంటర్ సిస్టమ్ వద్దు- పర్సెంటేజ్ ముద్దు : కె.ఎస్. రామారావు

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments