Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ ఆ పని చేస్తే విశాఖ ఉక్కు దక్కుతుంది: గంటా శ్రీనివాసరావు

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (17:16 IST)
విశాఖ ఉక్కు కోసం 25 మంది ఎంపిలు, 175 మంది ఎమ్మెల్యేలు తమ పదవులను రాజీనామా చేయాలన్నారు మాజీ మంత్రి, టిడిపి నేత గంటా శ్రీనివాసరావు. రాజీనామాలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామన్నారు. విశాఖ ఉక్కుపై పవన్ కళ్యాణ్ బిజెపిపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అలా చేస్తే మన విశాఖ ఉక్కు మనకు దక్కుతుందన్నారు.
 
తెలుగువారి ఆత్మగౌరవం విశాఖ ఉక్కు అన్న గంటా శ్రీనివాసరావు.. విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలన్నారు. ఉక్కు పోరాటంపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారని.. లేఖ కూడా రాశారన్నారు. 10 వేల మంది నిర్వాసితులు, వేలాదిమంది ఉద్యోగులు, లక్షలాది కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా విశాఖ ఉక్కుపై ఆధారపడి ఉన్నాయన్నారు.
 
ఇప్పటికే 32 మంది విశాఖ ఉక్కు కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. తన రాజీనామాపై రాజకీయ విమర్సలు చేయడం బాధాకరమన్న గంటా శ్రీనివాసరావు, రాజీనామాపై స్పీకర్ ఫోన్ చేశారని, రాజీనామాను ఆమోదించమని కోరానన్నారు. రాజకీయ లబ్ధి కోసం తన పదవికి రాజీనామా చేయలేదన్నారు.
 
బిజెపి నేతలు స్పందిస్తున్న తీరు బాధాకరమని.. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తున్నట్లు స్వయంగా విజయసాయిరెడ్డే చెప్పారని గుర్తు చేశారు. బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకించారని, ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం విశాఖ ఉక్కుపై పునరాలోచన చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments