Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేడ‌పి టోల్ గేట్ వ‌ద్ద రగడ... ఐఎఎస్. అధికారి పోలా భాస్క‌ర్ కారు అడ్డుకుని...

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (11:24 IST)
క‌ర్నూలు- గుంటూరు జాతీయ ర‌హ‌దారిపై త్రిపురాంతకం మండలం మేడపి టోల్  సిబ్బంది ఓవర్ యాక్షన్ చేశారు. ఐఎఎస్. అధికారి పోలా భాస్క‌ర్ కారు ముందు అడ్డుగా నిలబడి అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై ఉన్న మేడపి టోల్ గేట్ వద్ద, టోల్ ఫీజ్ విషయంలో ఐఎఎస్. అధికారికి, టోల్ ప్లాజా సిబ్బందికి మ‌ధ్య మాటా మాటా పెరిగింది. పెద్ద గొడ‌వే జ‌రిగింది.
 
ప్రకాశం జిల్లా కలెక్టర్ గా ప‌నిచేసి, ప్రస్తుతం కాలేజ్ ఎడ్యూకేషనల్ కమినర్ గా పోలా బాస్కర్ ప‌నిచేస్తున్నారు. కారు ఆపి టోల్ క‌డితేనే వెళ్ళ‌నిస్తామ‌ని టోల్ సిబ్బంది ఆయ‌న్ని హెచ్చ‌రించారు. దీనితో ఇద్ద‌రి మ‌ద్య, మాటకు మాట గొడ‌వ‌గా మారింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు మండల రెవెన్యూ తాసిల్దార్ వి. కిరణ్ కుమార్ టోల్గేట్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. 
 
టోల్గేట్ ప్లాజా సిబ్బంది మాట్లాడే తీరు, విధానాన్ని మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. టోల్ గేట్ సిబ్బంది విధి నిర్వహణ, ప్రవర్తన స‌క్ర‌మంగా ఉండాలని, ప్రభుత్వ వాహనాలను గుర్తించాల్సిన అవసరం ఉంద‌ని తెలియ‌జెప్పారు. సిబ్బంది ప్ర‌వ‌ర్త‌న బాగాలేక‌పోతే కేసులు నమోదు చేయాల్సిన పరిస్థితి వస్తుందని త్రిపురాంతకం మండల తాసిల్దార్ కిరణ్ కుమార్ హెచ్చరించారు. చివ‌రికి స‌ర్ది చెప్పి పోలాభాస్క‌ర్ వాహ‌నాన్ని పంపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments