Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు తెలియదు, నాకు గుర్తులేదు: అమరావతి మహిళలపై మురికి వ్యాఖ్యలు చేసిన కృష్ణం రాజు ఆన్సర్స్

ఐవీఆర్
శనివారం, 21 జూన్ 2025 (12:48 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి చుట్టుపక్కల వుండే గ్రామ మహిళలపై దారుణమైన వ్యాఖ్యలు చేసి అరెస్టయిన కృష్ణం రాజు బ్యాంకు ఖాతాలో డబ్బు వెంటవెంటనే జమ అయ్యాయి. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు ఆయన బ్యాంకు పుస్తకాన్ని ముందు పెట్టి ఇలా రోజుల వ్యవధిలోనే మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ అయ్యాయి. ఆ డబ్బు మీకు ఎవరు జమ చేసారు, మీ ఆదాయ మార్గాలు ఏమిటి, మీకు ఈ డబ్బు ఎందుకు వేసారు, దేనికి ఈ డబ్బు మీ బ్యాంకులో జమ అయ్యింది, డబ్బును జమ చేస్తున్నవారు ఎవరు అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించినట్లు తెలిసింది.
 
పోలీసులు ఎన్ని ప్రశ్నలు వేసినా మురికి వ్యాఖ్యల కృష్ణం రాజు, నాకు తెలియదు... గుర్తులేదు అంటూ దాటవేసినట్లు సమాచారం. కాగా కృష్ణంరాజును మూడు రోజుల కస్టడికి తీసుకున్న పోలీసులు తుళ్లూరు ట్రాఫిక్ పోలీసు స్టేషనులో వుంచి విచారణ చేపట్టారు. దాదాపు 40 ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేసినట్లు తెలిసింది.
 
అమరావతి రాజధాని ప్రాంత మహిళలపై మురికి వ్యాఖ్యలు చేయడం వెనుక ఎవరి ప్రోద్బలం ఏమైనా వుందా, మహిళలపై అలాంటి వ్యాఖ్యలు చేయడానికి మీ వద్ద వున్న ఆధారాలు ఏమిటి అని ప్రశ్నించినట్లు తెలిసింది. నిందితుడిని మరో రెండు రోజుల పాటు విచారించనున్నారు. ఈ మొత్తం విచారణ న్యాయవాది సమక్షంలో జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments