Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్‌ని నేనే... చక్రం తిప్పినోణ్ణి నేనే.. చంద్రబాబు టముకు

తొమ్మిదిన్నర ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా.. ఇపుడు మళ్లీ ముఖ్యమంత్రిగా ఉన్న నాలాంటి నాయకుడు దేశంలోనే ఎవరూ లేరని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘనంగా చెప్పుకున్నారు. దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్‌ను తానేనని.. ఐకే గుజ్రాల్, వాజ్‌పేయి ప

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (04:34 IST)
తొమ్మిదిన్నర ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా.. ఇపుడు మళ్లీ ముఖ్యమంత్రిగా ఉన్న నాలాంటి నాయకుడు దేశంలోనే ఎవరూ లేరని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘనంగా చెప్పుకున్నారు. దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్‌ను తానేనని.. ఐకే గుజ్రాల్, వాజ్‌పేయి ప్రభుత్వాల్లో చక్రం తిప్పానని గుర్తు చేసుకున్నారు. గురువారం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన బాబు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏలో కొనసాగుతున్నానని పునరుద్ఘాటించారు. ‘రాష్ట్రం విడిపోయాక నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి బాట పట్టించేందుకు బస్సు నుంచే పరిపాలన చేశాను. 
 
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఎలాంటి హామీలు ఇవ్వలేనంటూనే కుప్పం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వరాలు ప్రకటించారు. ఇంటింటికీ మినరల్‌ వాటర్‌ అందిస్తానని, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే కుప్పంలో ప్రపంచ స్థాయి కమర్షియల్‌ బిల్డింగ్‌ నిర్మిస్తానని చెప్పారు.కుప్పంలో నిరుద్యోగం లేకుండా చేసేందుకు ఇప్పటికే బ్రిటానియా లాంటి కంపెనీలు వచ్చాయని, మరిన్ని కంపెనీలు వచ్చేలా పారిశ్రామికవేత్తలతో సంప్రదిస్తున్నామన్నారు.
 
తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీలో నిలపడంలో అలసత్వం వహిస్తుండటంపై మంత్రులు నారాయణ, సిద్ధా రాఘవరావులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. కుప్పంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో గురువారం ముఖ్యమంత్రి.. మంత్రి నారాయణ, సిద్దారాఘవరావులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయమై మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం.
 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments