Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సీఎం చంద్రబాబును కాదమ్మా.. డిప్యూటీ సీఎం పవన్‌ను : జనసేన చీఫ్

Pawan kalyan
ఠాగూర్
మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (09:12 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం విశాఖ, మన్యం జిల్లాల్లో పర్యటించి, అడవితల్లి బాట అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కొందరు అభిమానులు సీఎం చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. వెంటనే కల్పించుకున్న పవన్ కళ్యాణ్.. నేను సీఎం చంద్రబాబు నాయుడు కాదమ్మా.. నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అడవి తల్లిని నమ్ముకుంటే అన్నం పెడుతుందని, నీడ నిస్తుందన్నారు. అరకు ఒక అద్భుతమైన ప్రాంతమని, దీనిని అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన్యం ప్రాంతాల్లో సరైన రహదారి లేక గిరిజన పుత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి రహదారి సౌకర్యం కల్పించి వారి జీవనశైలిని మారుస్తామన్నారు. 
 
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన గ్రామాల్లో రూ.1500 కోట్లు విలువ చేసే రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. తాము ఓట్ల కోసం రోడ్లు వేయడం లేదన్నారు. 
 
అలా అనుకుంటే అరకుతో మన్యం ప్రాంతంలో రోడ్లు వేసేవారం కాదని చెప్పారు. ఎందుకంటే గత ఎన్నికల్లో అరకు ప్రాంత ప్రజలు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయలేదన్నారు. అయినప్పటికీ తమకు కోపం లేదన్నారు. రాజకీయాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments