Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు కాదంటే.. కర్ణాటకకు వెళ్లినోణ్ణి..! ప్రత్యేక హోదా నన్ను ఎందుకు అడుగుతారు? : వెంకయ్య

Webdunia
సోమవారం, 25 మే 2015 (06:19 IST)
తెలుగు రాష్ర్టాల ప్రజలు తనను కాదన్నారనే కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లానని, అలాంటప్పుడు  ప్రత్యేక హోదాపై తననెందుకు ప్రశ్నిస్తారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఎదురు ప్రశ్నించారు. తనను అడగడం భావ్యం కాదని తన అసంతృప్తిని సున్నితంగా వెల్లగక్కారు. తాను ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే మంత్రిని కాదని, అన్ని రాష్ర్టాలకూ మంత్రిని అని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా తనకు అన్ని రాష్ర్టాలు సమానమేనని పేర్కొన్నారు.. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. 
 
యూపీఏ చేసిన తప్పు వల్లే తమ ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే ప్రత్యేక హోదా సాధించలేకపోయామని వివరించారు. ప్రత్యేక హోదా పొందే అంశాలేవీ ఏపీకి లేవని, లోటుబడ్జెట్‌ అన్న ఒక్క అంశమే ప్రత్యేక హోదా అడగటానికి కారణంగా ఉందని వెంకయ్య పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 11 రాష్ర్టాలు ప్రత్యేక హోదా కోరుతున్నాయని, ఏపీ లోటు బడ్జెట్‌ను పూరించేందుకు జాతీయ స్థాయిలో కృషి చేశానని చెప్పారు.
 
నవ్యాంధ్ర రాజధాని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ స్థాయిలో ల్యాండ్‌ పూలింగ్‌ చేపట్టడం అభినందనీయమన్నారు. టీడీపీ, బీజేపీ మైత్రి కొనసాగుతుందని భావిస్తున్నానని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై తనకు ఇంకా నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్‌ బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయని విలేకరులు వెంకయ్యను ప్రశ్నించగా, అందులో తప్పేముందని బదులిచ్చారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

Show comments