Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారాహిని అడ్డుకుంటారా.. ఆయనకు తిక్కరేగితే పాదయాత్ర చేస్తాడు .. అపుడు మీకు కాశీయాత్రే : హైపర్ ఆది

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (12:18 IST)
శ్రీకాకుళం జిల్లా రణస్థలి వేదికగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం యువశక్తి సదస్సు జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్న ఈ బహిరంగ సభలో బుల్లితెర హాస్య నటుడు హైపర్ ఆది కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంతో పాటు పవన్ కళ్యాణ్‌ను విమర్శలు గుప్పిస్తున్న వైకాపా నేతలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. 
 
వాహాన్ని వాహనాన్ని అడ్డుకుంటారా? ఆయనకు తిక్కరేగితే పాదయాత్ర చేస్తారు. అపుడు మీరు కాశీయాత్రకు పోవాల్సిందే. పవన్ కళ్యాణ్ జనాల పక్షాన ఉన్నాడు కాబట్టే జనసేనాని అయ్యాడు. ఈ మధ్య ప్యాకేజీ అంటున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రేమకు లొంగుతాడు ప్యాకేజీకి కాదురా? అని అన్నారు. 
 
ఇక దత్తపుతుడు అంటున్నారు.. మీరు ఓ నోటితో అయితే దత్తపుత్రుడు అన్నాడో అదే నోటితో అంజనీపుత్రుడు అనిపించుకుంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్‌ను ఏదో ఒక మాట అనేసి పాపులర్ అయిపోవాలనుకునేవాడే. మీ పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీ దెబ్బతినేలా మాట్లాడితే ఈసారు జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తుకు వస్తాడు అని అన్నారు. 
 
ఒక్కడి నిజాయితీని తట్టుకోలేక 151 మంది భయపడిపోతున్నారు. అదేనా మీ రాజకీయం? పవన్‌ది నిలకడలేని రాజకీయం కాదు. నిఖార్సయిన రాజకీయం. పవన్‌పై కులముద్ర వేస్తున్నారు.. నన్ను కన్న నా కన్నతల్లిపై ఒట్టేసి చెబుతున్నా.. పవన్ వంటి నీతిమంతుడైన రాజకీయ నాయకుడిని మరొకరిని చూడలేదు" అని అన్నారు. 
 
అభివృద్ధి పేరుతో ప్రెస్మీట్లు పెట్టి.. పవన్ కళ్యాణ్‌ను అమ్మనాబూతులు తిట్టేమీరు నీతుల వల్లిస్తారా.. అంతెందుకు.. పవన్ కళ్యాణ్‌ను బూతులు తిట్టే శాఖ అంటూ ఓ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసుకోండి అంటూ వైకాపా నేతలకు హైపర్ ఆది సలహా ఇచచారు. మీరేమో వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలు చేయొచ్చా.. ఏమీలేని ఆయన సినిమాలు చేసుకుంటా రాజకీయం చేయకూడదా? అని ప్రశ్నించారు. టేబుల్‌పై భారతదేశం బొమ్మ పెట్టుకుని టేబుల్ కింద చేయిచాచే మీది నిలకడలేని రాజకీయం అంటూ దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments