Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి ప్రస్తావనతో ఇంటికొచ్చి అత్యాచారం చేసిన మాట్రిమోనిలో పరిచయమైన వ్యక్తి

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (17:12 IST)
హైదరాబాద్ నగరం ఇపుడు పశువైద్యురాలు ప్రియాంకా రెడ్డి హత్య కేసు ఘటనపై చర్చసాగుతోంది. ఈ ఘటన మరువకముందే ఇపుడు మరో దారుణం జరిగింది. పెళ్లి ప్రస్తావన తెచ్చిన ఓ వ్యక్తి.. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ వ్యక్తి కూడా మాట్రిమోని ద్వారా పరిచయమై ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, నిజాంపేటలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ యువతి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ తన సోదరితో కలిసి అద్దె ఇంట్లో నివశిస్తోంది. వారికి 20 రోజుల క్రితం మాట్రిమోని ద్వారా జయచంద్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వారం రోజుల క్రితం సుజనా ఫోరమ్‌ మాల్‌ వద్ద బాధితురాలి సోదరితో తమ పెళ్లి విషయమై కలిసి మాట్లాడాడు. 
 
ఈ సందర్భంగా పెళ్లి ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. ఈ విషయంపై కుటుంబ సభ్యులతో మాట్లాడాలని బాధితురాలి సోదరి చెప్పారు. ఈ పరిచయాన్ని అవకాశంగా తీసుకున్న జయచంద్‌.. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి వద్దకు వచ్చి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం గదిలో ఉన్న నగలతో పరారయ్యాడు. 
 
సాయంత్రం బాధితురాలు సోదరి ఇంటికి రాగా.. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments