Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడుతో తల్లి అక్రమ లింకు.. కుమార్తె సహకారం... చికెన్‌లో ఎలుకల మందు కలిపి...

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (12:59 IST)
తల్లి అక్రమసంబంధానికి ఓ కుమార్తె సహకరించింది. దీంతో తల్లి తనకు తిరిగేలేదని రెచ్చిపోయింది. అయితే, అక్రమ సంబంధం గుట్టు ఎక్కువ రోజులు సాఫీగా సాగలేదు. ఓ రోజున కట్టుకున్న భర్త కనిపెట్టాడు. దీంతో భర్తను హత్య చేసేందుకు ఆ మహిళ ప్లాన్ చేసింది. తన ప్రియుడుతో కలిసి హత్య చేసింది. తండ్రి హత్యకు కుమార్తె సైతం సహకరించడం ఇక్కడ గమనార్హం. 
 
తెలంగాణ రాష్ట్రంలోని కీసరలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిస్సాకు చెందిన బీర వసంత్‌(40) చాలా కాలం క్రితం హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు. బీర వసంత్ తన భార్య రేణుకతో కలిసి రాజీవ్‌గృహాకల్పలో ఉంటూ టెంట్‌హౌస్‌లో కూలీగా పని చేస్తున్నాడు. రేణుక గ్యాస్‌ గోదాంలో రోజూ కూలిపనికి వెళ్లేది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 
ఈ క్రమంలో రేణుకకు గ్యాస్‌ గోదాంలో తనతో పాటు పని చేస్తున్న కిషోర్‌తో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం 13 యేళ్ల కుమార్తెకు సైతం తెలిసినప్పటికీ.. ఆమె పెద్దగా పట్టించుకోలేదు. పైగా, తల్లికి తనవంతు సహకారం అందిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఈ విషయం భర్తకు కూడా తెలిసింది. దీంతో భార్యను మందలించాడు. 
 
అయితే, ప్రియుడి మోజులో పడిన రేణుక ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నింది. ఇందుకు తన కుమార్తె (13) సహకారం కోరింది. తల్లి సూచన మేరకు ఈనెల 13వ తేదీన కుమార్తె చికెన్‌లో ఎలుకల మందు కలిపి తండ్రి వసంత్‌కు వడ్డించారు. ఈ విషయాన్ని పసిగట్టిన వసంత్.. చికెన్ తినలేదు. ఆ తర్వాత రాత్రి మద్యం సేవించి నిద్రిస్తున్న వసంత్‌ను రేణుక తన ప్రియుడు కిషోర్, కుమార్తెతో కలిసి చున్నీతో మెడకు బిగించి హత్య చేశారు. 
 
అనంతరం అతిగా మద్యం తాగినందునే చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. మరుసటి రోజు ఉదయం మృతదేహాన్ని అక్కడినుంచి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించడంతో హత్య చేసినట్లు నిర్ధారణైంది. హత్యకు వినియోగించిన చున్నీ, టవల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులు రేణుక, కిషోర్‌ను రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments