Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచం తీసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. సస్పెండ్ అయ్యాడు..

సోషల్ మీడియా ప్రభావంతో ప్రస్తుతం చిన్న తప్పు జరిగినా వెలుగులోకి వస్తోంది. లంచం తీసుకోవడం ఎంత తప్పో తెలిసిందే. లంచం తీసుకోవడం ద్వారా ఎన్నో వ్యవస్థలు మసకబారుతున్న తరుణంలో.. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదా

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (12:20 IST)
సోషల్ మీడియా ప్రభావంతో ప్రస్తుతం చిన్న తప్పు జరిగినా వెలుగులోకి వస్తోంది. లంచం తీసుకోవడం ఎంత తప్పో తెలిసిందే. లంచం తీసుకోవడం ద్వారా ఎన్నో వ్యవస్థలు మసకబారుతున్న తరుణంలో.. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారుడి నుంచి లంచం వసూలు చేసిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. ఫేస్ బుక్, యూట్యూబ్‌లలో ఈ వీడియోను ఇప్పటికే ఐదు లక్షల మంది వీక్షించారు. 
 
ఇదంతా హైదరాబాద్‌లోని హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో చోటుచేసుకుంది. హిమాయత్‌నగర్‌లోని వై జంక్ష‌న్ వ‌ద్ద విధులు నిర్వ‌ర్తిస్తున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ హెల్మెట్ లేని  వాహ‌న‌దారుడిని ఆపాడు. ఆపై అతని వద్ద లంచం తీసుకున్నాడు. దీనిని నగరానికి చెందిన శ్రీధర్ వేముల త‌న ఫోన్‌లో చిత్రీక‌రించి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా హైద‌రాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ఫేస్‌బుక్‌ పేజీకి ట్యాగ్ చేశాడు. దీంతో ఆ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ అయిపోయింది. 
 
ఇప్పటికే ఈ వీడియోను ఐదులక్షల మంది వీక్షించగా, పదివేల మంది షేర్ చేశారు. ఈ వీడియో ఆధారంగా లంచం తీసుకున్న ట్రాఫిక్ పోలీస్ సత్యవిష్ణును ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ జితేందర్ సస్పెండ్ అయ్యాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments