Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవ్ చేయకుంటే చస్తా.. ప్రేమికుడిని బెదిరించి సూసైడ్ చేసుకున్న టెక్కీ

హైదరాబాద్‌కు టెక్కీ సునీత మృతి కేసులో సరికొత్త ట్విస్ట్. ఈమెది హత్యా.. ఆత్మహత్యా అని చర్చ సాగుతున్న సమయంలో ఇపుడు ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తన ప్రేమను ప్రియుడు అంగీకరించక పోవడంతో ఆత్మహత్య చేసు

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (12:46 IST)
హైదరాబాద్‌కు టెక్కీ సునీత మృతి కేసులో సరికొత్త ట్విస్ట్. ఈమెది హత్యా.. ఆత్మహత్యా అని చర్చ సాగుతున్న సమయంలో ఇపుడు ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తన ప్రేమను ప్రియుడు అంగీకరించక పోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కూకట్‌పల్లికి చెందిన సునీత అనే టెక్కీ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ముఖ్యగా మృతురాలి సిమ్ కార్డు ఆధారంగా కాల్ లిస్ట్, వాట్సాప్‌ మెసేజ్‌లను పోలీసులు సేకరించారు. 
 
ఇందులో సునీత తన ప్రియుడితో ఎక్కువసార్లు మాట్లాడినట్టు గుర్తించారు. దీంతో కూకట్‌పల్లికి చెందిన స్నేహితుడిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇతను గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్‌ ఐటీ పార్క్‌లోని ఓ కంపెనీలో టెలీకాలర్‌గా పని చేస్తున్నాడు.
 
కూకట్‌పల్లి నుంచి గచ్చిబౌలిలోని తాను పనిచేసే కంపెనీకి వెళ్లే ఇతను సునీతను మాదాపూర్‌ భాగ్యనగర్‌ సహకార సొసైటీ రోడ్డులో కలుసుకునేవాడని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఈ నెల 13న కూడా కలిసినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత రోజు ప్రేమికుల దినోత్సవం. తన ప్రేమను అంగీకరించాలని సునీత తనకు చెప్పిందని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించిందని ఆ యువకుడు చెపుతున్నాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments