Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొల్లారంలో రేడియో జాకీ మిస్టరీ డెత్... ఆర్మీ మేజర్ అరెస్టు...

హైదరాబాద్‌లోని బొల్లారంలో రేడియో జాకీ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ హత్య కేసులో ఆమె భర్త ఆర్మీ మేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
గురువారం, 4 మే 2017 (09:52 IST)
హైదరాబాద్‌లోని బొల్లారంలో రేడియో జాకీ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ హత్య కేసులో ఆమె భర్త ఆర్మీ మేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌కు చెందిన సంధ్యా సింగ్‌ (28)కు మేజర్ విశాల్‌కు 2015, సెప్టెంబర్‌లో వివాహం జరిగింది. వివాహం సందర్భంగా భారీగానే కట్న కానుకలు ఇచ్చారు. ఆపై హైదరాబాద్‌కు వచ్చిన దంపతులు బొల్లారంలో నివశిస్తూ వచ్చారు. సంధ్యా సింగ్ రేడియో జాకీగా రాణిస్తూ వచ్చింది.ఈ క్రమంలో సంధ్యాసింగ్‌ కొద్ది రోజుల క్రితం తన బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
 
కాగా, సంధ్యాసింగ్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మేజర్‌ విశాల్‌ వైభవ్‌, అతడి తల్లిపై మృతురాలి సోదరి ఉమాసింగ్‌ బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాక, సంధ్యా సింగ్‌ను ఆమె భర్త, అత్త తరచూ డబ్బులు కావాలని వేధించే వారని పేర్కొన్నారు.
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇందులోభాగంగా, విశాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించేందుకు రక్షణశాఖ అధికారుల అనుమతి కోరారు. అంతలోనే విశాల్‌ వైభవ్‌ గుండెపోటు వచ్చిందంటూ రక్షణశాఖ ఆస్పత్రిలో చేరాడు.
 
కాగా, పోలీసులు రక్షణ శాఖాధికారులపై ఒత్తిడి పెంచడంతో మిలిటరీ అధికారులు నిందితుడిని బొల్లారం పోలీసులకు అప్పగించారు. దీంతో అడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు బొల్లారం పోలీసులు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments