Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదిన, మరిది వివాహేతర సంబంధం,.. కన్నపేగుకు ఉరి

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (08:19 IST)
వదిన, మరిది వివాహేతర సంబంధం కన్నపేగుకు ఉరి వేసేలా చేసింది. మరిదితో ఉన్న అక్రమ సంబంధాన్ని తెంచుకోలేని ఓ వివాహిత తన రెండేళ్ల కుమార్తెకు ఉరేసి చంపేసింది. ఆ తర్వాత తన ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన తెలంగాణాలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం బానూరు గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మధ్యప్రదేశ్‌లోని సిమ్రూద్‌ హయ్యర్‌ గ్రామానికి చెందిన గజేంద్ర కుసుబ.. పటాన్‌చెరు మండలంలోని ఓ ప్రైవేటు సంస్థలో కార్మికునిగా పని చేస్తున్నారు. భార్య రేఖ(28) కూతురు సోనమ్‌(2)తో కలిసి బానూరులో నివాసముంటున్నారు. 
 
అయితే, గజేంద్ర సోదరుడు బసుదేవ కుసుబ(27) బానూరులోని సోదరుని ఇంటి పక్కనే నివాసముంటూ స్థానికంగా ఓ పరిశ్రమలో పనికి చేరాడు. అయితే, రేఖకు, కుసుబలు వారి స్వగ్రామంలో ఉన్నప్పుడే వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం బహిర్గతం కావడంతో పంచాయతీ పెద్దల వరకు వెళ్లింది. 
 
ఆ తర్వాత బసుదేవ నందిగామ వచ్చిన తర్వాత కూడా ఆ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వదిన మరిది ఏకాంతంగా గడుపుతున్నారు. దీన్ని గజేంద్ర కళ్ళారా చూశాడ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ కూతురు సోనమ్‌కు చీరతో ఉరి వేసిన రేఖ, ఆపై బసుదేవతో కలిసి అదే చీరకు ఉరి వేసుకుని కనిపించింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, గజేంద్ర పక్క గదిలో ఉండగానే ఈ దారుణం జరిగింది. దీనిపై స్థానిక పోలీసుల కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments