Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ ఫోన్‌ కోసం ఫ్రెండ్‌ను హత్య చేసిన స్నేహితుడు...

మొబైల్ ఫోన్ కోసం ఓ ఫ్రెండ్‌ను మరో స్నేహితుడు హత్య చేశాడు. తన అప్పులు తీర్చేందుకు మొబైల్‌ను చోరీ చేసేందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడరు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ హత్యపై పోలీసులు వెల్లడించిన వ

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (08:58 IST)
మొబైల్ ఫోన్ కోసం ఓ ఫ్రెండ్‌ను మరో స్నేహితుడు హత్య చేశాడు. తన అప్పులు తీర్చేందుకు మొబైల్‌ను చోరీ చేసేందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడరు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ హత్యపై పోలీసులు వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే...
 
హైదరాబాద్ నగరం, ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్‌కు చెందిన గడ్డం సాగర్(19) అనే యువకుడి కుటుంబం రామంతాపూర్‌లో నివాసముంటుంది. సాగర్ గతంలో డెలివరీ బాయ్‌గా పనిచేసి మానేశాడు. ఇదే ప్రాంతంలో నివాసమున్న సురేశ్ అనే వ్యక్తి కుమారుడు ప్రేమ్(17)తో సాగర్‌కు పరిచయం ఉంది. వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా. ప్రేమ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. 
 
అయితే, సాగర్‌కు ఇటీవల ఆర్థిక సమస్యలు, అప్పులు ఎక్కువయ్యాయి. అదేసమయంలో ప్రేమ్ వద్ద ఖరీదైన ఫోన్‌ ఉంది. దీన్ని చోరీచేసి అమ్మేసి అప్పులు చెల్లించాలని ప్లాన్ వేశాడు. కానీ, ఫోన్‌ను చోరీచేస్తే తెలిసిపోతుందని భావించి, ప్రేమ్‌ను హత్య చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ నెల 13న సాయంత్రం సాగర్ లాంగ్‌డ్రైవ్‌కు బైక్‌పై ప్రేమ్‌ను తీసుకెళ్లాడు. 
 
నాదర్‌గూల్ సమీపంలో కొంత పెట్రోల్‌ను బైక్‌లో, మరో లీటర్ పెట్రోల్‌ను బాటిల్‌లో పోయించుకొని ఆదిబట్ల ప్రాంతానికి చేరుకున్నాడు. నారాయణ కాలేజీ సమీపంలోని ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డులోకి తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాతంలో బైక్‌ను ఆపాడు. తర్వాత సాగర్ కట్టెతో ప్రేమ్ తలపై గట్టిగా కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. సాగర్ ప్రేమ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి, సెల్‌ఫోన్ తీసుకుని ఇంటికి వచ్చాడు. 
 
అయితే, పొద్దుపోయిన తర్వాత కూడా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తండ్రి సురేశ్ అర్థరాత్రి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సాగర్‌ను విచారించారు. తనకేమీ తెలియదని, ప్రేమ్ రామంతాపూర్‌లోనే బైక్ దిగిపోయాడని సాగర్ బుకాయించాడు. దీంతో పోలీసులు ప్రేమ్ సెల్‌ఫోన్ కాల్‌డాటా, సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సాగర్‌ను గట్టిగా ప్రశ్నించగా హత్య వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments