Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపమని రక్షిస్తే చేతిని కొరికేసింది.. మద్యంమత్తులో యువతి హల్‌చల్

Webdunia
ఆదివారం, 17 నవంబరు 2019 (15:50 IST)
మద్యంమత్తులో ఓ యువతి హల్‌చల్ సృష్టించింది. పీకల వరకు మద్యం రోడ్డుపై అపస్మారకస్థితిలో పడివున్న యువతిని పోలీసులు పాపంభీతికెళ్లి స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ మద్యం మత్తులో ఓ ఎస్సై, ముగ్గురు లేడీ కానిస్టేబుళ్ళపై దాడికి దిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జహీరానగర్‌లో సదరు యువతి అపస్మారక స్థితిలో పడి ఉంది. స్థానికుల సమాచారంతో ఆమెను బంజారాహిల్స్ పీఎస్‌కు తీసుకొచ్చారు. 
 
కొద్దిసేపటికి కళ్లు తెరిచిన ఆమె.. పోలీసులను అభ్యంతరకర రీతిలో తిట్టడం ప్రారంభించింది. ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మహిళా ఎస్సైపై దాడి చేసింది. మరో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లను కొట్టింది. ఓ కానిస్టేబుల్ చేతిని కొరికి, మెడపై రక్కి నానా రభస చేసింది. 
 
అక్కడి నుంచి పరిగెత్తి పారిపోతుండగా.. ఎలాగోలా ఆమెను పోలీసులు అడ్డకున్నారు. దర్యాప్తులో ఆమెను నాగాలాండ్‌కు చెందిన లీసాగా గుర్తించారు. మాదాపూర్‌లో పని చేస్తుందని తెలిసింది. ఆమెను సంబంధీకులకు అప్పగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆమె మద్యం సేవించిందా.. డ్రగ్స్ తీసుకుందా తేలాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments