Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కానింగ్ కోసం వెళితే... పాడుపనికి పాల్పడిన టెక్నీషియన్

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (10:45 IST)
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి వైద్యుల వద్దకు వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు.. స్కాన్ తీయించాలని సలహా ఇచ్చారు. దీంతో వైద్యుల సూచన మేరకు ఆ యువతి స్కాన్ తీసుకునేందుకు ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌కు వెళ్లింది. కానీ, స్కానింగ్ సెంటర్‌లో టెక్నీషియన్ చేసిన పాడుపనికి ఆమె పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
హైదరాబాద్ నగరంలోని గోల్కొండ ప్రాంతానికి చెందిన 22 యేళ్ళ యువతి... అనారోగ్యంతో బాధపడుతూ వైద్యుడుని సంప్రదించింది. ఆయన సూచన మేరకు విజయనగర్‌ కాలనీలో ఉన్న విజయా డయాగ్నస్టిక్‌ సెంటర్‌‌కు సిటీ స్కానింగ్‌ తీయించుకునేందుకు వెళ్లింది. 
 
అక్కడ టెక్నీషియన్‌గా పని చేస్తున్న ఓ యువకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. తాకకూడని చోట తాకాడు. దీనిపై బాధితురాలు హుమయూన్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. నిందితుడిని అరెస్ట్ చేశామని, ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. 
 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments