Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ పరువు తీసిన బిర్యానీ.. గుర్తింపు కోల్పోయిన బిర్యానీ మేకర్స్

తెలంగాణ ప్రస్తుత రాజధాని హైదరాబాద్ పరువు పోయింది. కారణం నోరూరించే దాని బిర్యానీ వల్లే. నిజాం రాజుల కాలం నుంచి హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి గౌరవం కల్పించిన చిహ్నాలు రెండే రెండు. అవి చార్మినార్.. రెండు బిర్యానీ. చార్మినార్ హైదరాబాద్‌లో ఉంది అంటే ప్రపంచమం

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (04:00 IST)
తెలంగాణ ప్రస్తుత రాజధాని హైదరాబాద్ పరువు పోయింది. కారణం నోరూరించే దాని బిర్యానీ వల్లే. నిజాం రాజుల కాలం నుంచి హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి గౌరవం కల్పించిన చిహ్నాలు రెండే రెండు. అవి చార్మినార్.. రెండు బిర్యానీ. చార్మినార్ హైదరాబాద్‌లో ఉంది అంటే ప్రపంచమంతా నమ్ముతుంది. అలాగే అసలు సిసలైన బిర్యానీ ఎక్కడుంది అంటే కూడా హైదరాబాద్‌కేసే చూపుతారు. కాని ఆ బిర్యానీ మీదే అని గ్యారంటీ కానీ ఆధారం కాని ఉన్నాయా అన్న ప్రశ్నకు బిర్యానీ తయారుదారుల సంస్థ చేతులెత్తేసింది. అలా నగరం పరువు కూడా పోయింది. 
 
ఈ సమస్య ఎక్కడ బయలుదేరిందంటే .. హైదరాబాద్ బిర్యానీకీ జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్‌లోని దక్కన్ బిర్యానీ మేకర్స్ అసోసియేషన్ దరఖాస్తు చేసింది. కానీ  అసలు హైదరాబాద్‌ బిర్యానీ.. ఇక్కడిదే అని చెప్పడానికి చారిత్రక ఆధారాలు ఏవీ లేవని పేర్కొం టూ.. చెన్నైలోని జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ రిజస్ట్రీ గుర్తింపు ఇవ్వడానికి తిరస్కరించింది.
 
నిజాం రాజుల వంటశాల నుంచి బిర్యానీ సామాన్యుని చెంతకు చేరిందని హైదరాబాద్‌లో కథలు కథలుగా చెబుతుంటారు. అయినా సరే దీనికి ఆధారాలు చూపలేకపోయారు. బిర్యానీ మీదే కావచ్చు కానీ దాని చరిత్రకు సంబంధించిన ఆధారాలు చూపమంటే ఎలా చూపుతారు. తన వంటగదిలో ఆ బిర్యానీని ఎవరు చేశారో చెప్పడానికి నిజాం  రాజే లేకపోయె మరి. కాబట్టి  ఈ బిర్యానీ తమది అని చెప్పుకునే ఘనత హైదరాబాద్‌కు లేకుండా పోయంది. 
 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments