Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ప్రాంతం మంచిది కాదు.. రాత్రిపూట ఒంటరిగా ఇంటికెళ్లొద్దంటూ నమ్మించి ఎయిర్‌హోస్టెస్‌పై అత్యాచారయత్నం

హైదరాబాద్‌లో ఎయిర్‌హోస్టెస్‌పై అత్యాచారయత్నం జరిగింది. ఈ ప్రాంతం మంచిది కాదు... ఇక్కడ ఉండొద్దు.. పైగా ఇంత రాత్రిపూట ఒంటరిగా వెళ్లొద్దంటూ.. నేను ఇంటికి తీసుకెళ్తా అంటూ నమ్మించి... కావాల్సిన చోటికి తీసు

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (09:04 IST)
హైదరాబాద్‌లో ఎయిర్‌హోస్టెస్‌పై అత్యాచారయత్నం జరిగింది. ఈ ప్రాంతం మంచిది కాదు... ఇక్కడ ఉండొద్దు.. పైగా ఇంత రాత్రిపూట ఒంటరిగా వెళ్లొద్దంటూ.. నేను ఇంటికి తీసుకెళ్తా అంటూ నమ్మించి... కావాల్సిన చోటికి తీసుకెళ్లి వదిలిపెడతానంటూ నమ్మించి క్యాబ్ ఎక్కించుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ యువతి ప్రతిఘటించడంతో చివరకు ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్ శివార్లలో రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఉప్పర్‌పల్లి హ్యపీహోమ్స్ ప్రాంతానికి చెందిన ఓ యువతి (24) ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తోంది. సోమవారం అర్థరాత్రి ఆమెకు మందులు అవసరం ఉండడంతో పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 216 ప్రాంతానికి వచ్చింది. అక్కడ షాపులన్నీ మూసి ఉండటంతో రోడ్డు పక్కన నిలబడి ఉండగా... ఓ తెలుపు రంగు క్యాబ్ వచ్చి ఆమె వద్ద ఆగింది. 
 
ఆ క్యాబ్ డ్రైవర్ ఆ యువతి వద్దకు వచ్చి ఇక్కడ ఎందుకు నిల్చున్నావని ప్రశ్నించాడు. ఆ ప్రాంతం మంచిది కాదని, ఒంటరిగా ఉండడం ప్రమాదకరమన్నాడు. 'మీ ఇంటిదగ్గర వదిలేస్తా రమ్మ'ని నమ్మించి వాహనంలో ఎక్కించుకున్నాడు. వేగంగా రాజేంద్రనగర్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు.
 
ఆ యువతి గట్టిగా ప్రతిఘటించడంతో దాడికి పాల్పడ్డాడు. అయినా ఆమె నిలువరించడం, గట్టిగా కేకలు వేస్తుండడంతో... ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కుని పారిపోయాడు. వెంటనే ఆ యువతి రోడ్డుపైకి వచ్చి సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆమెను రక్షించారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో అత్యాచారయత్నం, దోపిడీ కింద కేసులు నమోదు చేశారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments