Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాటిళ్లలో ఉన్నవి నీళ్లు అనుకుని ఇద్దరు విద్యార్థులు యాసిడ్ తాగేశారు..

బాటిళ్లలో ఉన్నవి నీళ్లు అనుకొని ఇద్దరు విద్యార్థులు యాసిడ్ తాగి ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చోటుచేసుకుంది. యాసిడ్ తాగడంతో వారి నోరు, గొంతు భాగాల్లో తీవ్

Webdunia
శనివారం, 1 జులై 2017 (10:54 IST)
బాటిళ్లలో ఉన్నవి నీళ్లు అనుకొని ఇద్దరు విద్యార్థులు యాసిడ్ తాగి ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చోటుచేసుకుంది. యాసిడ్ తాగడంతో వారి నోరు, గొంతు భాగాల్లో తీవ్రగాయాలు కావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మోత్కూరు ప్రైవేట్ పాఠశాల స‌మీపంలో కొంద‌రు పారిశుద్ధ్య కార్మికులు ప‌లు యాసిడ్ బాటిళ్లు పెట్టారు.
 
అయితే, దాహంతో ఆ ప్రాంతానికి వెళ్లిన సాగర్ (11), మణి (4) అనే విద్యార్థులు ఆ బాటిళ్ల‌లో నీళ్లున్నాయ‌నుకుని యాసిడ్‌‌ను తాగేశారు. సాగ‌ర్ ఆ స్కూల్లో రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడ‌ని, మ‌ణి ఇంకా ఆ స్కూల్లో జాయిన్ కాలేద‌ని, అయిన‌ప్ప‌టికీ స్కూల్ వ‌ద్ద‌కు వ‌చ్చాడ‌ని అధికారులు చెప్పారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రి ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments