Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను చంపి శవాన్ని మూటగట్టి కుళ్ళిన కోళ్లు పాతిపెట్టే గొయ్యిలో పూడ్చిపెట్టిన కసాయి భర్త

పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ భర్త తన భార్య పట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. ఆమెను హత్య చేయడమే కాకుండా, శవాన్ని కుళ్లిన కోళ్లు పాతిపెట్టే గొయ్యిలో పడేసి పూడ్చిపెట్టాడు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చ

Webdunia
మంగళవారం, 14 మార్చి 2017 (15:58 IST)
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ భర్త తన భార్య పట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. ఆమెను హత్య చేయడమే కాకుండా, శవాన్ని కుళ్లిన కోళ్లు పాతిపెట్టే గొయ్యిలో పడేసి పూడ్చిపెట్టాడు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పగో జిల్లా గోపాలపురం మండలం గంగోలు గ్రామానికి చెందిన వానుపు రాములు-నాగమణి దంపతుల కుమార్తె వెంకటలక్ష్మి (24)ని పది సంవత్సరాల క్రితం నల్లజర్లకు చెందిన రాచూరి వీర్రాజుతో వివాహం చేశారు. భార్య వెంకటలక్ష్మి బంధువుల వద్ద భర్త వీర్రాజు రూ.2 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టాడు. గత మార్చి నెల నుంచి భార్యా భర్తల మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ వివాదం కుల పెద్దల వరకు వెళ్లింది. 
 
దీంతో తీసుకున్న అప్పు జూన్‌ 30 తేదీలోపు చెల్లించి విడాకులు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. భర్తతో గొడవల నేపథ్యంలో వెంకటలక్ష్మి తన ఇద్దరు పిల్లలు తరుణ్‌కుమార్‌, ధనసాయిలతో కలిసి అదే ఊరిలో మరో ఇంట్లో నివశిస్తూ వస్తోంది. ఈ క్రమంలో గత నెల 26వ తేదీ నుంచి వెంకటలక్ష్మి కనిపించండం లేదని ఆమె తల్లిదండ్రులకు ఇరుగుపొరుగువారు సమాచారం అందించగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో స్థానిక పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, భర్త వీర్రాజుపై అనుమానించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా, తన భార్యను తానే హత్య చేసినట్టు అంగీరించాడు. వెంకటలక్ష్మిని ఆమె ఉంటున్న నివాసంలోనే గత నెల 26వ తేదీ రాత్రి చెక్కతో కొట్టి హత్య చేసినట్టు చెప్పాడు. శవాన్ని మూటకట్టి బైక్‌పై చీపురుగూడెంలోని కోళ్ళ ఫారం వద్దకు తీసుకువచ్చి కుళ్లిన కోళ్ళను పాతిపెట్టే గొయ్యిలో పూడ్చిపెట్టినట్టు అంగీకరించాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

‘వికటకవి’ పీరియాడిక్ సిరీస్‌.. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఖాయం: డైరెక్ట‌ర్ ప్ర‌దీప్ మ‌ద్దాలి

కార్తీ లుక్ దేనికి హింట్.. కంగువకు సీక్వెల్ వుంటుందా?

తాజా ఫ్యాషన్ ఫోటోషూట్‌లో శృతి హాసన్ అదుర్స్

గమ్మత్తయిన గాత్రం కోసం రమణ గోగులను రంగంలోకి దింపిన అనిల్ రావిపూడి

పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. శ్రీలీల ఫీజెంత.. రష్మిక మందన్న ఎంత తీసుకుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

తర్వాతి కథనం
Show comments