Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్నెల్లుగా అనుమాన.. చెల్లితో కలిసి చర్చికి వెళ్లొస్తున్న భార్యపై దాడి

ఆర్నెల్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయవాడ, సత్యనారాయణ పురంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
బుధవారం, 27 జులై 2016 (11:35 IST)
ఆర్నెల్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయవాడ, సత్యనారాయణ పురంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... పెజ్జోనిపేట డేవిడ్‌ వీధిలో నివసించే తెజశ్వని(22)ని స్థానికంగా కారు డ్రైవర్‌గా ఉన్న కె మహేష్‌ను ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకుంది. అయితే, ఆర్నెల్లపాటు సజావుగా సాగిన వారి కాపురంలో అనుమానం పెనుభూతమైంది. 
 
భార్యపై అనుమానం పెంచుకుని నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ నెల 17వ తేదీన తల్లి విజయకుమారి, చెల్లితో కలిసి పెజ్జోనిపేటలోని బాప్టిస్టు చర్చికి వెళ్లింది. ప్రార్థనలు ముగించుకుని 11 గంటలకు ఇంటికి వస్తుండగా పెజ్జోనిపేట సీకే రెడ్డి రోడ్డులోకి వచ్చేసరికి భర్త కొబ్బరి బోండాలు నరికే కత్తితో తేజశ్వనిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె మెడపైన, వీపు భాగం, చేతికి గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం పోలీసులు మంగళవారం మహేష్‌ను అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments