Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్.. త్వరలో ఆరు లేన్లు!

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (18:38 IST)
NH
హైదరాబాద్-విజయవాడ నేషనల్​ హైవే(ఎన్​హెచ్​65)ను ఆరు లేన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం నాలుగు లేన్లుగా ఉన్న ఈ రోడ్డు త్వరలో ఆరు లేన్లుగా మారనుంది. 
 
ఆరు లేన్ల నిర్మాణంలో అండర్ పాస్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు కీలకంగా మారనున్నాయి. మొదటి దశ నాలుగులేన్ల రోడ్డు చేపట్టి ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పదేళ్లు పూర్తవుతుంది. బీఓటీ పద్ధతిలో జీఎమ్మార్ సంస్థ 2009లో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం ప్రారంభించి 2012లో పూర్తి చేసింది. 
 
చౌటుప్పుల్ మండలం దండుమల్కాపురం నుంచి విజయవాడు వరకు 238 కిలోమీటర్లు కాగా, దీంట్లో తెలంగాణ పరిధిలో నేషనల్ హైవే 182 కిలోమీటర్లు మాత్రమే. 
 
దండుమల్కాపురం నుంచి సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకు ఆరులేన్లుగా విస్తరించేందుకు సుమారు రూ.3వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments