Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సులో భారీగా డబ్బు

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (08:56 IST)
కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా డబ్బు పట్టుబడింది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో చేపట్టిన తనిఖీల్లో ఓ ఆర్టీసీ బస్సులో వారి బ్యాగ్స్ ఓపెన్ చేస్తే డబ్బులు కట్టాల కట్లు నోరెళ్ళబెట్టి ఉన్న ప్రయాణికులు. రూ.1.90 కోట్ల నగదు పట్టుబడింది.

అనంతపురంలోని మారుతినగర్‌కు చెందిన కోనేరు రామ చౌదరి, గుంతకల్‌కు చెందిన రంగనాయకులు హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు కుప్పం డిపో బస్సులో వస్తున్నారు. నిఘావర్గాల సమాచారంతో సీఐ లక్ష్మీదుర్గయ్య, సిబ్బంది బస్సును ఆపి తనిఖీ చేశారు.

దీంతో వీరిద్దరి బ్యాగుల్లో రూ 1.90 కోట్ల నగదు బయటపడింది. అప్పటి వరకు తమ పక్కనే ప్రయాణించిన వ్యక్తుల వద్ద కట్టల కొద్దీ డబ్బు చూసి తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. అయితే ఈ నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో నగదును సీజ్‌ చేసి, స్థానిక కర్నూలు అర్బన్‌ పోలీస్‌ స్టేషన్లో అప్పగించారు.

రామచౌదరిని విచారించగా పొలం కొనుగోలు కోసం హైదరాబాద్‌ వెళ్లామని, బేరం కుదరకపోవడంతో డబ్బుతో స్వగ్రామానికి వెళుతున్నట్టు పోలీసులకు తెలిపారు. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments