Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ వైఫల్యాలను మాపై పెడితే ఎలా?: టీడీపీ

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (09:36 IST)
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తమపై నెట్టడం సరి కాదని టీడీపీ హితవు పలికింది. పెండింగ్ బిల్లులనే సునామీ అనడం వైసిపి చేతగానితనమని, మండలిలో బడ్జెట్ సందర్భంగా మంత్రి బోస్ దివాలాకోరు వ్మాఖ్యలు చేశారని దుయ్యబట్టింది. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్సీ టిడి జనార్దన్ ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు యధాతథంగా...
 
గత ప్రభుత్వాల పెండింగ్ బిల్లులు చెల్లించడం ఏ ప్రభుత్వానికైనా సామాన్యమే. ఇదేదో ఇప్పుడే వైసిపి ప్రభుత్వం కొత్తగా చేసినట్లు చెప్పడం వైసిపి దివాలాకోరుతనం. ప్రభుత్వానికి మీరు కొత్తేమో గాని, పద్దతులు తెలుసుకుని మాట్లాడటం మంచిది.
 
2014లో పెండింగ్ బిల్లులు రూ32వేల కోట్లు ఉన్నాయి. విభజన వల్ల రూ16వేల కోట్ల ఆర్ధికలోటు ఉంది. అప్పుడున్న సునామీతో పోలిస్తే ఇప్పుడేమి సునామీ ఉంది..? మీకు చేతగాక ఎదుటివాళ్లపై పడి ఏడవడం మానండి.
 
2008-2014 పారిశ్రామిక బకాయిలు రూ 3,100 కోట్లు టిడిపి ప్రభుత్వం చెల్లించింది. మీ తండ్రి పెట్టిన పెండింగ్ బిల్లులు కూడా టిడిపి ప్రభుత్వం చెల్లించింది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ 3,700కోట్లు చెల్లించాం.

గత ప్రభుత్వాల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, పారిశ్రామిక ప్రోత్సాహక బకాయిలు, వైద్య బిల్లుల బకాయిలు, సున్నావడ్డీ బకాయిలు తర్వాత ప్రభుత్వాలు చెల్లించడం సాధారణమే. టిడిపి హయాంలో బకాయిలు తామే చెల్లించినట్లు వైసిపి చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. 
 
‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు’ అన్నట్లుగా వైసిపి ధోరణి ఉంది. అధికారం వైసిపికి కొత్తేమో గాని టిడిపికి కొత్తకాదు. 38ఏళ్ల పార్టీ చరిత్రలో 22ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ టిడిపి. 

ఆదాయంతో పాటు పెండింగ్ బిల్లులు సంక్రమించడం సర్వసాధారణం. గత ప్రభుత్వ పెండింగ్ బిల్లులు రూ 32వేల కోట్లు టిడిపి ప్రభుత్వానికి వారసత్వంగా సంక్రమించాయి.

దీనికి తోడు రాష్ట్ర విభజన వల్ల మరో రూ16వేల కోట్ల ఆర్ధికలోటు భారం టిడిపి ప్రభుత్వంపై పడింది. అంటే మొత్తం రూ48వేల కోట్ల భారం తొలి ఏడాదే పడినా టిడిపి ప్రభుత్వం సమర్ధంగా ఆర్ధిక  పరిస్థితి చక్కదిద్దింది. 

అలాంటిది వైసిపి ప్రభుత్వం గత ప్రభుత్వం నుంచి సంక్రమించిన పెండింగ్ బిల్లులపై అంకెల గారడి చేస్తోంది. మొదట రూ30వేల కోట్ల బిల్లులు అన్నారు, తర్వాత రూ40వేల కోట్లు అన్నారు, ఇప్పుడు రూ60వేల కోట్ల బిల్లులు అంటున్నారు. నోటికి హద్దు అదుపు లేకుండా అబద్దాలు చెబుతున్నారు. 

సునామీలా పెండింగ్ బిల్లుల భారం వైసిపి ప్రభుత్వంపై పడిందని మంత్రి పిల్లి సుభాస్ చంద్ర బోస్ అనడం హాస్యాస్పదం. మీరు చెప్పే సునామీ ఇప్పుడేదో కొత్తగా వచ్చింది కాదని తెలుసుకోవాలి. 

ప్రతి ప్రభుత్వానికి తొలి ఏడాది వచ్చే పెండింగ్ బిల్లుల భారాన్నే సునామీ అనుకుంటే రూ 16వేల కోట్ల ఆర్ధికలోటు అదనపు భారాన్ని ఏ సునామీ అనాలో సుభాస్ చంద్రబోస్ గారే చెప్పాలి. 

మీ వైఫల్యాలకు కారణం చేతగాని తనం, అవినీతే తప్ప, ఆ నిందలు పొరుగు వాళ్ల మీద మోపడం భావ్యం కాదు. 
టిడిపి ఎంత సమర్ధంగా ఆర్ధిక పరిస్థితి చక్కదిద్దిందో ఒక్కసారి చూసుకోండి, లేదా అధికారులను అడిగి తెలుసుకోండి.

టిడిపి ప్రభుత్వ హయాంలో తలసరి ఆదాయం రూ 85,797 నుంచి రూ1,69,519కు పెంచాం. 5ఏళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు చేశాం. కొనుగోలు శక్తి పెంచాం, పొదుపు శక్తి పెంచాం, కాబట్టే తలసరి ఆదాయం పెంపు సాధ్యమైంది. జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయి. 

టిడిపి హయాంలో రాష్ట్ర బడ్జెట్ ను రూ 1,11,823కోట్ల నుంచి రూ2,27,975కోట్లకు పెంచాం. 5ఏళ్లలో మొత్తం బడ్జెట్ రూ 1,16, 152కోట్లు అదనంగా పెంచాం. 

కేపిటల్ ఎక్స్ పెండిచర్ రూ.7,069కోట్ల నుంచి రూ.29,596కోట్లకు పెంచాం. నాలుగు రెట్లకంటె ఎక్కువ మూలధన వ్యయం చేశాం. నీటిపారుదల ప్రాజెక్టులు, సిమెంట్ రోడ్లు, ఇళ్లు పెద్దఎత్తున నిర్మించాం.

టిడిపి హయాంలో ఏడాదికి సగటున రూ.26వేల కోట్లు అప్పులు చేస్తే వైసిపి ప్రభుత్వం ఏడాదిలోనే 87వేల కోట్ల అప్పులు చేశారు.

ఇంత అప్పు చేసికూడా ఏ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక్క రోడ్డు వేయలేదు. దీనిపై ప్రజలు నిలదీస్తారనే మీ వైఫల్యాలను టిడిపిపై నెట్టి తప్పించుకోవాలని చూడటం హేయం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments