Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణ కొరియా దుర్ఘటనల్లో ఎంత పరిహారం ఇచ్చారో?: టిడిపి

Webdunia
బుధవారం, 13 మే 2020 (08:11 IST)
విశాఖ దుర్ఘటన ముమ్మాటికీ మానవ తప్పిదమేనని, ఈ దుర్ఘటనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపి విజయసాయిరెడ్డి బాధ్యత వహించాలని టిడిపి నేతలు అభిప్రాయపడ్డారు.

బాధితులకు న్యాయం జరిగేవరకు టిడిపి పోరాటం చేయాలని, వారికి అండగా నిలవాలని జనరల్‌ బాడీ సమావేశం తీర్మానం చేసింది. దక్షిణ కొరియాలో ఇదే విధమైన దుర్ఘటనల్లో ఎంత పరిహారం ఇచ్చారో అంతే మొత్తం ఇప్పించేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు అధ్యక్షతన పార్టీ జనరల్‌ బాడీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. తొలుత గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీకి టిడిపి ప్రభుత్వమే అనుమతులిచ్చిందనే వైసిపి దుష్ప్ర్రచారాన్ని ఖండించారు. ఆరు దశాబ్ధాల క్రితం నుంచి ఏయే ప్రభుత్వాలు ఈ కంపెనీకి భూములిచ్చాయో, అనుమతులిచ్చారో సాక్ష్యాధారాలున్నాయన్నారు.

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాతనే పాలిస్ట్తెరిన్‌కు ఎక్స్‌పాండబుల్‌ పాలిస్ట్తెరిన్‌ విస్తరణకు అనుమతులివ్వడంతోపాటు కేంద్రానికి సిఫారసు చేసిందనే దానిపై అన్ని రుజువులు ఉన్నాయన్నారు. విషవాయువులు లీకేజీకి కారణమైన కంపెనీకి వత్తాసు పలుకుతూ బాధితులపై కేసులు పెట్టడాన్ని ఆయన ఖండించారు.

సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.. 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాల్సిన స్ట్తెరీన్‌ 130-150 డిగ్రీలకు చేరిందంటే అది కంపెనీ తప్పిదమేనని సమావేశం తీర్మానం చేసింది. నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కాలుష్యనియంత్రణమండలి, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు పేర్కొన్నాయి. మానవ తప్పిదంతో ఒక కంపెనీ 12మందిని చంపేస్తే దానికి బాధ్యులైన వాళ్లను అరెస్ట్‌ చేయకుండా , బాధితులపై కేసులు పెట్టడాన్ని ఖండించారు.

'మాకుటుంబాల్లో కూడా చనిపోతే బాగుండు. రూ.కోటి వస్తాయని బాధితులే అంటున్నారని కరణం ధర్మశ్రీ'పేర్కొనడం అమానుషమని టిడిపి నేతలు పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ఈనెల 28న సిఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని చూడటం హేయమని వారు పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ సూపర్‌స్ప్రెడర్‌గా వైసిపి నాయకులు మారడాన్ని ఖండించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్బంగా నర్సులను అభినందిస్తూ సమావేశం తీర్మానంచేసింది.

ఈ సమావేశంలో ఎంపిలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ నేతలు పాల్గన్నారు. ఈనెలాఖరులో టిడిపి మహానాడు నిర్వహించనున్న నేపథ్యంలో బుధవారం టిడిపి పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

Eleven review :నవీన్ చంద్ర నటించిన ఎలెవెన్ చిత్ర సమీక్ష

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments