Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిజెపి-జనసేన పొత్తు ఎంతకాలం?

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (10:22 IST)
కమలం పార్టీ-జనసేనల పొత్తు ఇక ఎంతోకాలం నిలవదేమో అనే అనుమానాలను రేగుతున్నాయి. బిజెపితో జనసేన తెగదెంపులు చేసుకోవడానికి రంగం సిద్ధమైందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయంపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. తెలంగాణ బిజెపి నేతలపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు కూడా బిజెపితో జనసేన పొత్తు నిలవదేమో.. అనేందుకు ఊతమిస్తున్నాయి.

తాము కేంద్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర శాఖ తమను అవమానించిందని పవన్‌ మండిపడ్డారు. తమను పదే పదే వాడుకుని వదిలేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజెపికే మద్దతు తెలిపామని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీని కనీసం పట్టించుకోలేదని ఆయన తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణిదేవికి మద్దతిస్తున్నామని పవన్‌ వెల్లడించడంతో బిజెపికి షాక్‌ ఇచ్చినట్లయింది.
 
తెలంగాణ బిజెపి నేతలపై విరుచుకుపడ్డ జనసేన నేత పవన్‌.. సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ప్రధాని పివి కూతురు, టిఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణి దేవికే తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రామచంద్రరావు బరిలో ఉన్నప్పటికీ ఆయనకు జనసేన మద్దతు తెలపలేదు.

పైగా ఓటింగ్‌ జరుగుతున్న రోజునే టిఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణికి మద్దతు ఇస్తున్నట్లు పవన్‌ ప్రకటించడంపై .. బిజెపి తో దూరం జరిగేందుకు పవన్‌ సిద్ధపడినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సురభివాణికి మద్దతు పలికినందుకు పవన్‌కు ఇసి నుంచి నోటీసులు కూడా అందాయి.

బిజెపితో పవన్‌ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారా ? అందుకే టిఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతు తెలిపారా ? అందుకే పవన్‌, బిజెపి కి దూరంగా జరగాలనుకుంటున్నారా ? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
 
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌ రోజే టిఆర్‌ఎస్‌కు పవన్‌ మద్దతు తెలపడంపై బిజెపి ఆగ్రహాన్ని వ్యక్తపరిచింది. తమతో పవన్‌ పొత్తు ధర్మాన్ని విస్మరించారంటూ.. బిజెపి తెలంగాణ విభాగం విమర్శించింది. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు పవన్‌కు ధన్యవాదాలు తెలిపామని బిజెపి నేతలు తెలిపారు.

ఏదేమైనా పవన్‌ చేసిన ఈ పని ఆమోదయోగ్యంగా లేదని బిజెపి రాష్ట్ర అధిష్ఠానం అసహనాన్ని వ్యక్తపరిచింది. పవన్‌ ఇలా అనూహ్య రీతిలో నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటో తెలియదని బిజెపి నేతలు ఓ ప్రకటనలో తెలిపారు.
 
సురభి వాణికి మద్దతు తెలుపుతూ పవన్‌ హైదరాబాదులో ప్రకటన చేస్తే, మరోవైపు విజయవాడలో జనసేన ప్రధాన కార్యదర్శి పోతిన మహేష్‌ బిజెపి పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బిజెపి వల్లనే ఓటమి పాలయ్యామని వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో బిజెపి, జనసేనతో కలిసి రాలేదని ఆరోపించారు. బిజెపితో పొత్తు వల్ల మైనార్టీలు జనసేనను వ్యతిరేకించారని అన్నారు. తమ అభ్యర్థులు గెలిచే స్థానాల్లో ఓడిపోవడానికి కారణం ఇదేనని మండిపడ్డారు. పోతిన మహేష్‌ ప్రకటనను బట్టి కూడా జనసేన బిజెపి తో ఖటీప్‌కు సిద్ధపడినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

మరోవైపు.. బిజెపి రాష్ట్ర నాయకత్వం తమను వాడుకుని వదిలేసిందంటూ.. జనసేన నాయకులు తన దఅష్టికి తెచ్చారని, గౌరవం లేని చోట మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని తమ నేతలతో అన్నట్లు పవన్‌ తెలిపారు. అలాంటివారితో మీరు ఇంకా స్నేహం చేయాలని చెప్పే ధైర్యం తనకు లేదని చెప్పినట్లు పవన్‌ స్పష్టం చేశారు. పవన్‌, మహేశ్‌ వ్యాఖ్యలలో బిజెపి పట్ల అసహనం స్పష్టంగా కనబడుతోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments