Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు కోసమే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపేశారా.. ఎవరు?

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (21:45 IST)
కడపజిల్లాలో వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీగా మారింది. ఇప్పటికే వివేకానందరెడ్డి పిఏ క్రిష్ణారెడ్డి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి డాగ్ స్క్యాడ్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. పోస్టుమార్టంలో కూడా వివేకానందరెడ్డిది హత్యేనని తేలింది. ఏడుచోట్ల అతి దారుణంగా నరికి చంపినట్లు ఆనవాళ్ళను పోలీసులు గుర్తించారు. కసితీరా వివేకానందరెడ్డిని చంపినట్లు తెలుస్తోంది. అయితే ఎవరు ఈ పని చేశారన్న కోణంలో పోలీసులు వేగంగా పావులు కదుపుతున్నారు.
 
దివంగతనేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి స్వయానా తమ్ముడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి స్వయానా బాబాయ్ కావడంతో ఈ కేసు సవాల్‌గా తీసుకుని ఛేదించే పనిలో ఉన్నారు పోలీసులు. డబ్బు కోసమే పనిమనిషి హత్య చేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే పనిమనిషిగా ఉన్న వ్యక్తి పరారీలో ఉండటంతో పోలీసులు సి.సి. ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
 
సి.సి.టివి ఫుటేజ్‌ను ఎస్పీ రాహుల్ స్వయంగా పరిశీలించి పనిమనిషి పనే ఇదంతా అన్న నిర్ణయానికి వచ్చారట. పని మనిషి వివరాలను ప్రస్తుతం సేకరిస్తున్నారు. త్వరలో అతన్ని పట్టుకుని మీడియా ముందు ఉంచే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యతో ఒక్కసారిగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments