Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరైనా చెల్లి, తల్లి జోలికి వస్తే లాగి కొడ్తారు.. జగన్‌కి పౌరుషం రాలేదా? (video)

సెల్వి
గురువారం, 7 నవంబరు 2024 (21:01 IST)
Anitha
సోషల్ మీడియా సమస్యల కోసం ప్రత్యేక చట్టం చేయాలనే అంశంపై వేగంగా స్పందించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లకు ధన్యవాదాలు అని హోం మంత్రి అనిత అన్నారు. కొందరు తనను లక్ష్యంగా చేసుకొని పోస్టులు పెడుతున్నారని అనిత గుర్తుచేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
 
సోషల్ మీడియా పోస్టులపై అనిత స్పందిస్తూ.. "ఆ పోస్టులు చూసి బాధేసింది. కానీ నేను గట్టిదాన్ని. అందుకే చలించలేదు. పోస్టులు చేస్తోన్న వెదవలను ఊరికే వదిలే ప్రసక్తే లేదు. కొందరు సోషల్ మీడియాను అస్త్రంగా వాడుతున్నారు. ఉగ్రవాదుల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిని ఊరికే వదిలే ప్రసక్తే లేదు. చట్టం ముందు నిలబెడతాం" అని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ నోటి వెంట వినకూడని మాటలు వస్తున్నాయని మండిపడ్డారు.
 
"చీకటి రోజులు అంటే ఏంటో తెలుసా జగన్ రెడ్డి? మా అక్కని ఏడిపిస్తున్నారు అంటే, ఒక చిన్న కుర్రాడిని తగలబెట్టేసారు చూడు. అవి చీకటి రోజులు అంటే. కనీసం ఒక ఎంక్వయిరీ చేసావా జగన్" అంటూ అనిత ఫైర్ అయ్యారు. 
 
"ఎవరైనా తన చెల్లి, తల్లి జోలికి వస్తే లాగిపెట్టి కోడతారు. అలాంటిది షర్మిలమ్మ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని నీ సోషల్ మీడియా వాళ్ళు పోస్ట్‌లు పెట్టినా కూడా జగన్‌కి పౌరుషం రాలేదా?" అంటూ అనిత వెల్లడించారు. కొన్ని కుక్కలు ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడితే చేతులు కట్టుకుని కూర్చోవాలా..? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments